జగిత్యాల శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఆరంభమైన ధనుర్మాసం ఉత్సవాలు !

జిల్లా కేంద్రంలో ప్రాచీన ఆలయం!.

( J. Surender Kumar)

జిల్లాకేంద్రంలో 400 సంవత్సరం నాటి అతి ప్రాచీనమైన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ శ్రీమదన వేణుగోపాల స్వామి ధనుర్మాస ఉత్సవాలు శుక్రవారం సాయంత్రం సాంప్రదాయ బద్ధంగా ప్రారంభమైనాయి. శుక్రవారం 16 నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుండటంతో స్వామివారికి ప్రత్యేక పూజలకు కైంకర్యాలకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

జిల్లా నుండే కాకుండా ఇతర ప్రాంతాల్లో నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీ వేణు గోపాల స్వామి మహిమగల దేవుడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శుక్రవారం సాయంత్రం ప్రారంభమై 2023 జనవరి 14 వరకు. గోదా శ్రీ రంగనాధుల కల్యాణంతో ఉత్సవాలు ముగియనున్నాయి.

వైష్ణ ఆలయాలకు ప్రీతికరమైన మాసం!
నెల రోజుల పాటు శ్రీ వైష్ణవులకు అత్యంత పవిత్రం, ప్రీతికరమైన వైష్ణవ దేవాలయంలో తిరుప్పావై , దివ్వ ప్రభంద ,పారాయణంతో వేకువజామున గోదారంగనాధులను దర్శించుకొని, ముక్తిని పొందే ధనుర్మాసంమని, ఆలయ పండితులు వివరించారు. సూర్యుడు ధనుస్సు రాశిలో, ప్రవేశించిన కాలం నుండి మకరరాశిలో ప్రవేశించు వరకు గల మధ్య కాలంలో సంక్రాంతికి ముందు వచ్చే నెల రోజులను ధనుర్మాసం మొదలై తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి సంక్రాంతి రోజులతో ధనుర్మాసం ముగుస్తుంది. దక్షిణాయనానికి, చివర ఉత్తరాయనాణానికి .ముందుడే ధనుర్మాసం పరమ పవిత్రమైంది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలిసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి ఆలయ వంశపార్యం పర అర్చకులు వివరించారు. సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ధనుర్మాసం ప్రారంభాన్నే పల్లె సీమల్లో సంక్రాంతి, నెల పట్టడం అంటారు. ధనుర్మాసం నెల రోజులు పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు , పారాయణం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.