కలెక్టర్ కు కౌన్సిలర్ ఫిర్యాదు !
( J. Surender Kumar)
జగిత్యాల పట్టణ నడిబొడ్డున గల టౌన్ హాల్ లీజు పొందిన వ్యక్తి అధికారుల అనుమతి లేకుండా, లోపల ఫ్లోరింగ్ తవ్వడం, డోర్లు, కిటికీలు కూడ త్రవ్వి వాళ్ళ కు అనుకూలంగా మార్చుకున్నారని, కమీషనర్ కు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదని 35 వార్డ్ కౌన్సిలర్ అనుముల జయశ్రీ . జిల్లా కలెక్టర్ కు, హైదరాబాద్ లోని మున్సిపల్ శాఖ అధికారులకు చేసిన ఫిర్యాదులు పేర్కొంది.

అగ్రిమెంటు రూల్స్ ను అతిక్రమించి అందులో పర్మినెంట్ స్ట్రక్చర్ నిర్మాణం ,అనుమతి లేకున్న పిల్లర్లు వేసి, భీమ్ లతో రూములు నిర్మాణంపై ఫిర్యాదు చేయడంతో అట్టి పనులు నిలిపివేశారని. ఇప్పుడు అదే స్థానంలో రేకులతో పర్మినెంట్ షెడ్లను అవే పిల్లర్ల.పైన వేశారు, లీజ్ డీడ్ లో ఉన్న అన్ని నిబంధనలను తుంగలో తొక్కుతూ వారి సొంత ఆస్థిగా బావిస్తూ లీజు దారుడు.. ఇష్టారాజ్యంగా టౌన్ హాల్ లో పనులు చేయిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ సంవత్సరం ఫిబ్రవరి 26న మున్సిపల్ తో చేసుకున్న అగ్రిమెంట్, నిబంధనలకు విరుద్ధంగా అక్కడ పనులు జరుగుతున్నాయని వెంటనే లీజును రద్దు చేయాల్సిందిగా ఆమె అనేక ఆరోపణలు చేస్తూ కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదు. పత్రంలో పేర్కొన్నారు.
.