జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణ
విస్తీర్ణం పెంచండి!

కలెక్టర్ కు కౌన్సిలర్ విన్నపం!

(J. SURENDER KUMAR)

జగిత్యాల నుండి కరీంనగర్ రోడ్డులో గల దరూర్ ను, మరియు మోతె గ్రామాన్ని, ధర్మపురి రోడ్ లో గల తిప్పన్నపేట్ గ్రామమును, గొల్లపెల్లి రోడ్ లో గల గ్రామాలను పట్టణంలో విలీనం చేసి ప్రభుత్వ ద్వారా పట్టణ విస్తీర్ణం పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలని, కౌన్సిలర్ అనుముల జయశ్రీ కలెక్టర్ కు ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నారు.

జగిత్యాల మున్సిపాలిటీ 1952 సం ఏర్పడిందని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి మున్సిపాలిటీ జగిత్యాల కు. గుర్తింపు ఉందని పేర్కొన్నారు. మున్సిపాలిటీగా మారిన సమయంలో పట్టణ విస్తీర్ణం ఎంతైతో ఉండేనో ఇప్పటికి కూడ అంతే విస్తీర్ణం ఉందని, పట్టణ జనాభా పెరిగిన కొద్ది వార్డ్ ల సంఖ్య పెంచుకోవడం జరిగింది తప్ప విస్తీర్ణం ఎప్పుడు పెంచిన దాఖలాలు లేవు అంటూ వినతిపత్రంలో వివరించారు. జిల్లాగా ఏర్పడిన తర్వాత కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించు కోవడం జరిగింది. ఈ మాస్టర్ ప్లాన్లో కూడ పట్టణ విస్తీర్ణం పెంపు జరగలేదన్నారు. . గతంలో ఉన్న విస్తీర్ణం లోనే “38” వార్డులుగా ఉంటే దాన్ని ”46″ వార్డులుగా మార్చుకొని మిగిలిన “2”వార్డులు ( 47, 48 ) వార్డులు శివారు గ్రామాలైన T.R. నగర్ ను మాత్రం కలుపుకొని అందులో ఈ రెండు వార్డులు పెంచుకున్నారని వివరించారు..

జగిత్యాల, T.R. నగర్ మధ్యలో ఉండే. * దరూర్ * గ్రామాన్ని ను వదిలి, T. R నగర్ ఎందుకు కలుపుకున్నారో ? అంత పట్టడం లేదని పేర్కొన్నారు. జగిత్యాల మున్సిపాలిటీ ఏర్పడి 70 సం,,లు అయినా , జిల్లాగా మారిన కూడ 70 సెంట్ల విస్తీర్ణం పెరిగింది లేదు. జగిత్యాల మున్సిపాలిటీకి చెందిన ప్రభుత్వ భూములు అన్ని కూడా అన్యాక్రాంతం కావడం వలన మున్సిపాలిటీకి సంబంధించిన ప్రభుత్వ భూములు పలువురు కబ్జా చేశారని పేర్కొన్నారు..గత పాలకులు “SRSP” కి సంబంధించిన స్థలాలు కాపాడుకోవటం వల్ల ఇప్పుడు అవి కొంత వినియోగించుకోవడానికి అవకాశం దొరికింది కాని, అది కూడ పూర్తిగా కేటాయింపులకు సరి పోగా.. ఇప్పుడు ఎవరికైనా స్తల కేటాయింపులు చేయాలంటే స్థలం లేని పరిస్థితి. మున్సిపల్ సమావేశంలో ఎజెండాలో ఆటోనగర్ కి, హెవీ వెహికల్ పార్కింగ్ ల కొరకు 20 మరియు 10 ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వంకు తీర్మాణం చేసి పంపించడం జరిగిందని పేర్కొన్నారు..lజిల్లా హెడ్ క్వార్టర్ అయిన దృష్ట్యా జనాభా దిన దినం పెరుగుతూ పట్టణ జనాభా పెరిగి చాల ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పట్టణ విస్తీర్ణం పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలని, కలెక్టర్ కు శనివారం ఇచ్చిన వినతిపత్రంలో కౌన్సిలర్ జయశ్రీ కోరారు