( .Surender Kumar)
జగిత్యాల జిల్లా కేంద్రంలో మూడు రోజులు పాటు ఘనంగా జరిగిన వైజ్ఞానిక ప్రదర్శన శనివారం ముగిసింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి , జిల్లా అడిషనల్ కలెక్టర్ మకరంద్, జిల్లా విద్యాధికారి డాక్టర్ శ్రీ బి జగన్మోహన్ రెడ్డి లు ముఖ్య అతిథులుగా విచ్చేసారు.,
ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి మాట్లాడుతూ మన దగ్గర ఉన్నటువంటి మకరంద, ఐఏఎస్ మనకు స్ఫూర్తిదాయకం ఏదైనా సాధించాలని తపన ఆరాటం దానికి తగ్గ పోరాటం ఉంటే మీరంతా గొప్పవారు అవుతారు పద్ధతి ప్రకారం చదవండి మంచి పౌరులుగా ఎదగండి మీరే మన దేశానికి సంపద ఎదగడానికి పేదరికం అడ్డు కాదని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీరందరికి హృదయపూర్వక ధన్యవాదాలు అని తెలియజేశారు.

కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి బి. శ్రీనివాస్ 3 రోజులకు సంబంధించిన నివేదిక వారికి అందించగా ఇన్స్పైర్ అవార్డు సంబంధించి 53 ప్రదర్శనలు రాగా, అందులో 5 ఉత్తమమైనవిగా గుర్తించారు, సైన్స్ విభాగంలో 180 ప్రదర్శనలు వచ్చాయి. ఇందులో 28 ప్రదర్శనలు ఉత్తమ మైనవిగా, ఈ కార్యక్రమంలో మొత్తం 54 స్కూల్లో 4123 మంది విద్యార్థులు పాల్గొన్నారు ఇక్కడ ఎన్నుకోబడిన ప్రదర్శనలు రాష్ట్రస్థాయికి పంపిస్తారు.,
జిల్లా విద్యాధికారి డాక్టర్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ పండుగలో మనమందరం సంతోషంగా ఉత్సాహంగా పాల్గొన్నారు విద్యార్థులందరూ ప్రతి విషయంలో పాల్గొనాలి వినూత్నంగా ఆలోచించాలి అబ్దుల్ కలాం చెప్పినటువంటి కలలు కనండి సహకారం చేయండి అని పిలుపునిచ్చారు. ఎస్ఎస్సి పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి చక్కగా చదువుకొని మంచి మార్కులు పొందాలని పేర్కొన్నారు.
అడిషనల్ కలెక్టర్ మకరంద మాట్లాడుతూ సైన్స్ అంటే ఏమిటి టెక్నాలజీ అంటే ఏమిటి క్రియేటివి అంటే ఏమిటి అంటే ప్రశ్నలతో విద్యార్థులతో మమేకమై విద్యార్థుల్లో కలిసిపోయి వారితో చర్చించార., ఏదైనా చేసినప్పుడు ఇది ఎందుకు చేస్తున్నాం ఇలా చేస్తున్నానని ఆలోచించినప్పుడే కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఏర్పడుతుంది అని పిల్లలకు తెలియజేసినారు.