గోదావరిఖని పట్టణంలో..
TUWJ 143, రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా!
(J. Surender Kumar)
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాసభ ను విజయవంతం చేయాలని జర్నలిస్టులను యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు లాయక్ పాషా కోరారు.
ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న టీయూడబ్ల్యూజే హెచ్ 143 ఉమ్మడి కరీంనగర్ జిల్లా మహాసభ గోదావరిఖనిలోని టీవీ గార్డెన్స్ లో సోమవారం నిర్వహించనున్నట్లు తెలిపారు.
మీడియా అకాడమీ చైర్మన్,రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ తో పాటు మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి రమణ, ఉమ్మడి జిల్లా కన్వీనర్ బిజిగిరి శ్రీనివాస్ లతోపాటు యూనియన్ రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరవుతున్నట్లు తెలిపారు.