ధర్మపురి పట్టణం కు చెందినసీనియర్ పాత్రికేయులు సంగనబట్ల రామక్రిష్ణయ్య , గత కొన్ని రోజుల క్రితం గుండె కు సంబంధించిన శస్త్రచికిత్స జరుగగా శనివారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
మంత్రి వెంట మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్యమ్మ, డిసిఎంఎస్ ఛైర్మన్ ఎల్లాల శ్రీకాంత్,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యేరి రాజేష్ పలువురు నాయకులు ఉన్నారు
పరామర్శలు! .

దమ్మన్నపేట గ్రామానికి చెందిన బండి రాజన్న గౌడ్ మరణించడంతో వారి కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు. తుమ్మెనాల గ్రామానికి చెందిన గుడిసెల భూమయ్య కుమారుడు ఇటీవల మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను. పరామర్శించి ఓదార్చారు
,వెంట స్థానిక ఎంపీటీసీ సభ్యులు తోడేటి గంగాధర్ ,వేముల రాజేష్,చిలుముల లక్ష్మణ్, రఫిక్ ముత్తినేనిమల్లేష్, మెరుగు లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.

అభినందనలు!

కరీంనగర్ జిల్లా చొప్పదండి రుక్మాపూర్ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల లో 6.వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివిన ఆవుల ఉమాకాంత్ ఎయిర్ ఫోర్స్ లో పైలెట్ ఆఫీసర్ ఎంపికయ్యారు, పుణె లోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ లో చేరి పైలెట్ అధికారిగా శిక్షణ తీసుకోనున్న ఉమాకాంత్ ధర్మపురి పర్యటనలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కలవడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి ఉమాకాంత్ ను శాలువా కప్పి అభినందనలు తెలిపారు…