కాపుల ఐక్యతతోనే రాజ్యాధికారం సాధించవచ్చు !

రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య!

చైతన్య యాత్రకు ధర్మపురిలో ఘన స్వాగతం !

(J. Surender Kumar)

రాష్ట్రంలో 40 నుండి 50 లక్షల మున్నూరు కాపు కులస్తులు ఉన్న, కాపులు ఆశించినా రీతిలో ప్రయోజనాలు, రాజకీయ పదవులు రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేవని, మున్నూరు కాపు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ధర్మపురి పట్టణంలోని పటేల్ గార్డెన్స్ లో జరిగిన కాపుల ఆత్మీయ సమ్మేళనం, హక్కుల సాధన చైతన్య యాత్ర ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు..కాపుల ఐక్యతతోనే కాపు కార్పొరేషన్ , ఆర్థిక స్వాలంబన, రాజకీయ ఎదుగుదల సాధించవచ్చు అన్నారు. ఈ లక్ష్యంతోనే రాష్ట్రవ్యాప్తంగా 119 కాపు హక్కుల సాధన చైతన్య యాత్రలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు.

యాత్రకు ఘన స్వాగతం

మున్నూరు కాపుల హక్కుల సాధనకై అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్మపురి పట్టణానికి చేరుకున్న చైతన్య యాత్రకు స్థానిక కాపు సంఘం నాయకులు, యువత ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ చౌక్ నుంచి బైక్ ర్యాలీ నంది చౌకు చేరుకొని, స్థానిక లక్ష్మీనరసింహస్వామిని, అనుబంధ దేవాలయలను రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ..స్వామి వారి శేష వస్త్రం, తీర్థప్రసాదాలు ఆలయ అధికారులు అందించారు.

అనంతరం నంది చౌక్ నుండి ర్యాలీ పటేల్ గార్డెన్స్ కు చేరుకున్నారు.. జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు, బుగ్గారం జడ్పిటిసి బాదినేని రాజేందర్, ధర్మపురి పట్టణ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు సంఘీ శేఖర్ , ధర్మపురి మండలం మున్నూరుకాపు సంఘం అధ్యక్షులు సౌళ్ళ భీమయ్య, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తెమ్మ మాట్లాడుతూ మున్నూరు కాపులు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా అన్ని రంగాలలో రాణించాలని అన్నారు. రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని. ధర్మపురిలో చైతన్య యాత్రను విజయవంతం చేసినవారికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ పటేల్ ,సీనియర్ పాత్రికేయులు సోమిశెట్టి మురళి స్తంభంకాడి శ్రీనివాస్ ,బొంగురాల రాజేష్ , స్తంభం కాడి అశోక్ గారు కళ్యాణపు శ్రీనివాస్ ముత్తినేని శ్రీనివాస్ రెంటం శంకర్ బొడ్డు కిషన్ కౌన్సిలర్లు బండారి అశోక్, అయ్యోరి వేణుగోపాల్, కొంపల పద్మ తిరుపతి, వడ్నాల ఉమాలక్ష్మి, కో ఆప్షన్ సభ్యులు అప్పాల వసంత్, దేవస్థాన ధర్మకర్త చుక్క రవి, స్తంభంకాడి మహేష్, మున్నూరు కాపు సంఘం స్థల ప్రదాత ఓడ్నాల మల్లేష్, ఉద్యోగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు చెరుకు రాజన్న , ధర్మపురి అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుమాందాస్ సత్యనారాయణ, వ్యవస్థాపక అధ్యక్షులు బండి మురళి గౌరవ అధ్యక్షులు సంఘీ నరసయ్య బండారి లక్ష్మణ్ నేరెళ్ల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు జాజాల రమేష్, మున్నూరుకాపు సంగం ప్రధాన కార్యదర్శి చల్ల గంగన్న , ఉపాధ్యక్షులు కాశెట్టి రాంబాబు, పురం శెట్టి నాగేష్ , ఆశెట్టి శ్రీనివాస్ ,ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆకుల శ్రీనివాస్ ,కాశెట్టి రాజేష్ ,కొడిమ్యాల నరసయ్య , ఓడ్నాల భూమేష్ ,నరసయ్య , సీనియర్ నాయకులు బండారి రాజన్న, మున్నూరు కాపు సీనియర్ నాయకులు వివిధ మండలాల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు గ్రామ కమిటీ అధ్యక్షులు పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

నెరేళ్ల గ్రామంలో ఘన స్వాగతం !

మున్నూరుకాపుల హక్కుల సాధనకై చైతన్య యాత్ర ఆత్మీయ సమావేశం కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య,జగిత్యాల జిల్లా అధ్యక్షుడు బాధినేని రాజేందర్ లకు స్వాగతం పలుకుతూ మండలంలోని నెరేళ్ల గ్రామంలో ఉమ్మడి గ్రామాల మున్నూరుకాపు సంఘం సభ్యులు శాలువతో సన్మానించారు అనంతరం వారితో కలిసి ధర్మపురి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు
ఈ కార్యక్రమంలో నెరేళ్ల గోవిందుపల్లె ఉమ్మడి గ్రామాల అధ్యక్షులు

కాశెట్టి మల్లేశం. నెరేళ్ల అధ్యక్షుడు న్యాయవాది జాజాల రమేష్,ఉపాధ్యక్షుడు పాదం చెంద్రయ్య ,గోవిందుపల్లె అధ్యక్షుడు కోల రాయమల్లు, గోవిందుపల్లె సర్పంచి పురంశెట్టి రాజయ్య ,నెరేళ్ల ఉపసర్పంచి జాజాల శెంకర్. నెరేళ్ల గోవిందుపల్లె మున్నూరుకాపు సంఘం సభ్యులు పాల్గొన్నారు