కేసీఆర్ ప్రకటించిన ₹100 కోట్లకు సైతం
అవినీతి పట్టనున్నదా ?
కొండగట్టు ఆదాయము కొల్లగొడుతున్నారు..
అవినీతి పరులను ఆదుకుంటున్నది ఎవరో ?
(J. Surender Kumar)
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆదాయంకు అవినీతి శని పట్టి పీడిస్తున్నది. ప్రతి ఆర్థిక సంవత్సరం ఆలయ ఆదాయ, ఖర్చుల వ్యవహారాలను పరిశీలిస్తున్న అధికారులు లక్షలాది రూపాయల పద్దుల వినియోగం పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, లిఖిత పూర్వకంగా వివరణ కోరిన ఆలయ అధికార యంత్రాంగంలో స్పందన కరువైంది. ఈనెల 7న జగిత్యాల పర్యటనలో సీఎం కేసీఆర్ కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం ₹ 100. కోట్ల రూపాయలు ప్రకటించారు. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేయనున్న ₹100 కోట్ల రూపాయల నిధులకు సైతం అవినీతి శని పట్టనున్నదా ? అని అంజన్న భక్తజనం ఆందోళన చెందుతున్నారు.
వివరాల్లోకి వెళితే.
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ప్రముఖ పుణ్యక్షేత్రంగా దేశంలో గుర్తింపు ఉంది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంత ప్రజలు,బడుగు, బలహీన వర్గాల లక్షలాది ప్రజల ఇష్టదైవం, ఇలవేల్పు,. అనారోగ్యం, ఇతి బాధలు, శని గ్రహచార దోషలు నివారణకు స్వామివారి కఠోర దీక్షలు ఆచరిస్తారు, కాలినడకన వందలాది.కిలోమీటర్ల పాదయాత్ర చేసి, స్వామివారిని దర్శించుకుని మోక్కులు చెల్లించుకుంటారు. అరకోర, వసతి సౌకర్యాలు ఉన్న వారు కొండపై నిద్రిస్తారు.
మహిమాన్విత గల శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆదాయంను కొందరు ఉద్యోగులు అక్రమ పద్ధతుల ద్వారా అందినంత దోచుకుంటున్న, వారిని అడిగే వారు కరువయ్యారు అనే ఆరోపణలు , విమర్శలు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులపై వినిపిస్తున్నాయి.
ఆలయ అభివృద్ధికి ₹100/-కోట్లు! సీఎం కెసిఆర్

కొండగట్టు ఆలయ అభివృద్ధి.కోసం గతంలో 300 ఎకరాల భూమిని. ఆలయానికి అప్పగించిన కెసిఆర్ ప్రభుత్వం, ఈనెల 7న జగిత్యాల బహిరంగ సభలో ₹100 కోట్ల రూపాయల నిధులు కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. అభివృద్ధి కోసం కేటాయించిన ₹100కోట్ల నిధులకు సైతం అవినీతి శని పట్టనున్నదా.? అనే అనుమానాలు భక్తజనం వ్యక్తం చేస్తున్నారు.

2020 -2021.ఆర్థిక సంవత్సరంలో..₹ 15,35,137/-
అభ్యంతరకరమైన 35 పద్దులుగా గుర్తించారు.
సాధారణ నిధులు, అన్నదానం తదితర మార్గాల ద్వారా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం కు ,2020-2021లో ₹11,83,46160/ -ఆదాయం వచ్చినట్టు రికార్డులో పేర్కొనబడింది..₹ 12,51,79,060/- ఖర్చు. అయినట్టు నమోదు చేశారు.
ఆదాయం ఖర్చు లెక్కలను తనిఖీలు చేపట్టిన అధికారులు అభ్యంతరకరమైన 35 పద్దుల ద్వారా.₹ 15,35,173/- (పదిహేను లక్షల, ముప్పది ఐదు వేల, ఒకవంద దెబయి మూడు రూపాయిలు) లిఖితపూర్వకంగా ప్రభుత్వ అధికారులు ఆలయ అధికారులను వివరణ కోరినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా ఈ ఆలయం ఆదాయ, నిధులను అధికారులు ఇష్టారాజ్యంగా ఖర్చులు చూపుతున్న సంఘటనలు ఉమ్మడి రాష్ట్రంలోనే శ్రీకారం చుట్టిన స్వరాష్ట్రంలోనూ అదే సాంప్రదాయాన్ని దేవాదాయ శాఖ అధికారులు. కొనసాగిస్తున్నారనే ఆరోపణలు విమర్శలు ఉన్నాయి.
దాదాపు ₹.21 కోట్లు, 445 పద్దుల లో అభ్యంతరాలను ఆడిట్ అధికారులు వివరణ కోరినట్టు సమాచారం 2008 నుంచి 2021 వరకు లెక్కల్లో మాత్రమే !
ఉమ్మడి రాష్ట్రంలో..

2007-08 లో ₹ 6,55,193/- అభ్యంతరకరమైన 12. పద్దులు!
2008-09 లో ₹ 70,29,231/- అభ్యంతరకరమైన 14 పద్దులు!
2010-11 లో ₹ 1,83,92,911/- అభ్యంతరకరమైన 20 పద్దులు!
2011-12 లో ₹ 4,11,27,680/- అభ్యంతరకరమైన 35 పద్దులు !
2012-13 లో ₹,32,84,032/- అభ్యంతరకరమైన 27 పద్దులు!
2013-14 లో ₹,53,96,384/-. అభ్యంతరకరమైన 34 పద్దులు!
స్వరాష్ట్రం లో…
2014-15 లో .₹ 1,44,02,543/-, అభ్యంతర 38 పద్దులు!
2015-16 లో ₹,4,69,46,387/-. అభ్యంతర 57 పద్దులు!
2016-17 లో ₹ 37,39,041/- అభ్యంతర 50 పద్దులు!
2017-18 లో ₹ 46,83,975/- అభ్యంతరకరమైన 46. పద్దులు!
2018-19 లో.₹ 59,18,469/- అభ్యంతరకరమైన 46 . పద్దులు!
2019-20 లో.₹,6,49,65,118/- అభ్యంతరకరమైన 31. పద్దులు!
2020-21 లో ₹,15,35,173/- అభ్యంతరకరమైన 35 పద్దులు!
మొత్తము రూపాయలు ₹ 21,80,76,137/- అభ్యంతరకరమైన 445 పద్దుల వివరాలను, ఆడిట్ అధికారులు దేవాదాయశాఖ కు లిఖితపూర్వకంగా తెలియ పరుస్తూ వివరణ కోరినట్టు సమాచారం. అభ్యంతరకరమైన పద్దుల ఖర్చులపై కొండగట్టు ఆలయ అధికారులు గానీ, దేవాదాయ శాఖ కమిషనర్, ఆడిట్ అధికారులకు వివరణ ఇచ్చారో ? లేదో ? అనే అంశంలో స్పష్టత లేదు.
