పలు అంశాలను నిర్ధారించుకున్నారు !
బాధ్యులను కాపాడుతున్నది ఎవరు ?
(J.Surender Kumar)
కొందరు అధికారులు, ఉద్యోగుల పాలిట కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ఆదాయం వారి పాలిట కామధేనువుగా, కల్పతరువుగా మారడంతో కాసులు కాజేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై విచారణ జరిపిన అధికారులు పలు అంశాలు నిర్ధారించుకున్నారు.. నెల రోజులైనా బాధ్యులపై చర్యలు తీసుకోవడం మరిచారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. బాధ్యులను కాపాడుతున్నది ఎవరు? అంటూ భక్తజనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు ఇలా ఉన్నాయి!
కొండగట్టు ఆలయంలో అవినీతి, అవకతల.పై గత నెల 23న హైదరాబాద్ దేవదాయశాఖ కు చెందిన అధికారిని ఏడిసి జ్యోతి మేడమ్, కరీంనగర్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, కొండగట్టు ఆలయంలో విచారణ చేశారు. .ఆలయ కార్యనిర్వహణాధికారి ఇష్టానుసారంగా నిధుల దుర్వినియోగం, నిబంధనలకు విరుద్ధంగా ఆదాయాన్ని ఖర్చు చేయడం. ఉద్యోగుల అర్చకుల సమయపాలన, తదితర అంశాలపై స్వయంగా దేవాదాయశాఖ కమిషనర్ ను కలిసి కొండగట్టు ఆలయ పాలకవర్గ చైర్మన్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. .ఈ ఫిర్యాదు మేరకే కమిషనర్ కొండగట్టు పై విచారణకు ఆదేశించారని సమాచారం.

విచారణలో విస్మయపరిచే అంశాలు ?
విచారణ చేపట్టిన అధికారులకు ఆలయ ఆదాయ, ఖర్చులకు సంబంధించిన. రికార్డులు తనిఖీ చేయగా, మినరల్ వాటర్ బాటిల్ కొనుగోళ్ళకు లక్షలాది రూపాయలు ఖర్చు చేసినట్టు నమోదయి ఉన్నట్టు తెలిసింది. ఆలయంలో ప్యూరిఫై మినరల్ వాటర్ ప్లాంట్ ఉంది. ఆలయ భూముల లీజు కు సంబంధించిన ఫైల్ ,విచారణ అధికారులకు లభ్యం కానట్టు సమాచారం. ఫిర్యాదు పత్రంలోని పలు అంశాలపై విచారణ చేయగా, 11 అంశాలలో వాస్తవాలు అని విచారణ అధికారులు నిర్ధారించుకున్నట్టు సమాచారం.
ముందస్తు అంచనాల బడ్జెట్ మంజూరు కాలేదా ?
రాష్ట్ర దేవాదాయ శాఖ రాష్ట్రంలోని ఆయా ఆలయాల ఆర్థిక స్థితిగతులను పరిగణంలోకి తీసుకొని ముందస్తు అంచనాల బడ్జెట్దే అనుమతులు జారీ చేస్తారు. అయితే కొండగట్టు ఆలయానికి ముందస్తు అంచనా బడ్జెట్ అనుమతులు రాకముందే వివిధ పద్దులకు లక్షలాది రూపాయలు ఖర్చును గుర్తించినట్టు సమాచారం. ఇట్టి ఖర్చులను ప్రతినెల ఆడిట్ చేయవలసిన అధికారులు, ముందస్తు అంచనాల బడ్జెట్ మంజూరు కానందున ఆడిట్ చేయడానికి అధికారులు నిరాకరించినట్టు చర్చ నెలకొంది.
ముందస్తు అంచనా బడ్జెట్ అంటే !
రాష్ట్రంలో ఆయా ఆలయాల ఆర్థిక స్థితిగతుల నేపథ్యంలో. కార్యనిర్వహణాధికారులు ఆర్థిక సంవత్సరంకు నెలరోజులు ముందుగానే. ఆలయంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు పద్దులకు సంబంధించిన ఖర్చు చేయాల్సిన నిధుల వివరాలను దేవాదాయ శాఖ కమిషనర్ కు నివేదిక అందిస్తారు. కమిషనర్ ఆమోదంతో ఉత్సవాలకు ఇంత మొత్తం, విఐపి ల ఖర్చులు, పత్రికా ప్రకటనలు, చలువ పందిళ్లు, విద్యుత్ దీపాల అలంకరణ, ఉద్యోగులకు అడ్వాన్సులు, తదితర అంశాలపై, ఇంత మొత్తం నగదుకు మించి. ఖర్చు చేయరాదు అంటూ, ఆయా అంశాలకు నిర్దిష్టమైన బడ్జెట్ ను కేటాయిస్తారు. ఆలయ ఆదాయంలో ఇంత శాతం ఆలయం పేరుతో డబ్బులను ఫిక్స్ డిపాజిట్ చేయాలంటూ తదితర అంశాలతో పాటు విధివిధానాలను తెలియజేస్తూ ఆర్థిక సంవత్సరంకు వారం రోజులు ముందుగా ముందస్తు అంచనాల బడ్జెట్ మంజూరి అనుమతులు జారీ చేస్తారు. అయితే నవంబర్ 23న విచారణ చేపట్టిన అధికారులకు బడ్జెట్ కు సంబంధించిన అనుమతి ఉత్తర్వులు లభ్యం కానట్టు సమాచారం.

అంజన్న ఆదాయం కాపాడండి!
కొండగట్టు క్షేత్ర అభివృద్ధికి వంద కోట్ల రూపాయల నిధులు ప్రకటించిన సీఎం కేసీఆర్, శ్రీరామ స్తూప నిర్మాణ కర్త ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, అంజన్న భక్తుడు ఆర్థిక మంత్రి హరీష్ రావు, ధర్మం కోసం, దేశం కోసం, హిందుత్వం కోసం అంటూ పోరాటాలు చేస్తున్న, కరీంనగర్ ఎంపీ, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్,. చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ లు జోక్యం చేసుకొని కొండగట్టు ఆంజనేయ స్వామి ని. ఆయన ఆదాయమును కాపాడాల్సిందిగా భక్తజనం వారిని ముక్తకంఠంతో కోరుతున్నారు.