లబ్దిదారులు ఆర్థికంగా బలోపేతం కావాలి!

మంత్రి కొప్పుల ఈశ్వర్ !

(J.Surender Kumar)

పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామంలో మంగళవారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు, పెద్దపల్లి ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ లతో కలిసి జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామంలో పర్యటించి గ్రామ పంచాయతీ కార్యాలయం అవరణలో ఏర్పాటు చేసిన కుట్టుమిషన్ల, చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఎస్.సి. కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు చిన్నపాటి రుణాలు, కుట్టు మిషన్లు పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఎస్సీ కార్పొరేషన్ ద్వారా జూలపల్లి మండలంలోని 25 మందికి చిన్నపాటి వ్యాపారాలు చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావడానికి వ్యాపారం ప్రారంభించుటకు మొదటి విడతగా 15 వేలు ఇప్పటికే మంజూరు చేశామని, రెండవ విడతగా ప్రస్తుతం 35 వేలు చెక్కులను అందజేస్తున్నామని, అలాగే మహిళలకు 3 నెలలపాటు శిక్షణ అందించి 46 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కుట్టు శిక్షణ కల్పించి ప్రోత్సహించి ఆర్థికంగా  ఆత్మస్థైర్యం కల్పించామని, ప్రభుత్వం ద్వారా కల్పించిన శిక్షణను, మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నేర్చుకున్న శిక్షణ పనికి రావాలని, నేర్చుకున్న వృత్తి తో నమ్మకం కలిగి ఆర్థికంగా ఎదగాలని, నేర్చుకున్న కుట్టు శిక్షణతో పాటు మగ్గం వర్క్ చేయడం, మంచి డిజైన్ నైపుణ్యంతో రాణించి ఎక్కువ మొత్తంలో బట్టలు కుట్టే విధంగా, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసి, వినియోగ దారులకు నమ్మకం కలిగించేలా పనిచేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు.


ఎమ్మేల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని, ఆర్థికంగా ఎదగాలనే ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని వర్గాల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని పలు పథకాలను, కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నదని, ఎనిమిది ఏళ్ల క్రింద ఉన్న పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులను పరిశీలన చేయాలని, కోరారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఆర్డీవో వెంకట మాధవ రావు, ఎంపిపి కూసుకుంట్ల రమాదేవి, వైస్ ఎంపిపి రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ చుక్కా రెడ్డి, సర్పంచ్ మేచినేని సంతోష్ రావు, ఉప సర్పంచ్ కొత్త మల్లేష్, ఎంపిటిసి తమ్మడవేన మల్లేశం, వార్డ్ సభ్యులు, గ్రామ కో ఆప్షన్ మెంబర్లు, ఈ.డి.ఎస్సీ కార్పొరేషన్, తహసిల్దార్ అబుబకర్, ఎంపిడిఓ వేణుగోపాల్ రావు, పంచాయతీ కార్యదర్శి జార్తి అంజలీదర్ రావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.