మహారాష్ట్ర సరిహద్దు అడవుల్లో ఎన్కౌంటర్

ఇద్దరు  మావోయిస్టులు మృతి !

తీవ్ర గాయాలతో మరొకరు పట్టివేత ?

మృతి చెందిన మహిళ మావోయిస్టుది నిర్మల్ జిల్లా?

(J.Surender Kumar)
మహారాష్ట్రలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య శుక్రవారం ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగింది . మహారాష్ట్ర -.ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్ జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.  కాగా ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసులెవరూ గాయపడలేదు హతమైన మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీన పరుచుకుని   ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఎన్‌కౌంటర్‌లో ఓ మహిళ సహా ,మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసు అధికారి తెలిపారు. మరో మావోయిస్టు రక్త గాయాలతో పారిపోయినట్టు చర్చ.  మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని ధమ్‌చా గ్రామంలోని అహేరిలో  ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగిందని చెప్పారు.  నిర్దిష్ట సమాచారం ఆధారంగా, గడ్చిరోలి పోలీసు సూపరింటెండెంట్ నీలోత్పాల్ ,.నేతృత్వంలోని పోలీసు బృందం అటవీ ప్రాంతంలో కార్డన్ ఆపరేషన్ ప్రారంభించింది. అకస్మాత్తుగా మావోయిస్టుల బృందం పోలీసు సిబ్బందిపై కాల్పులు ప్రారంభించింది, దీంతో పోలీసు బృందం ప్రతి కాల్పులు జరిపారని ఎస్పీ వివరించారు. 

కొద్దిసేపు ఎన్‌కౌంటర్ కొనసాగిందని,.మావోయిస్టులు. అడవుల్లోకి  పారిపోయారని అధికారి తెలిపారు.  అయితే పోలీసులు ఛత్తీస్‌గఢ్ సరిహద్దు వైపు దాదాపు 10 కిలోమీటర్ల మేర మావోయిస్టులను. వెంటాడినట్టు ఆయన వివరించారు..పోలీసు బృందం గాలింపు చేయగా.సంఘటన స్థలం నుండి ఒక పురుషుడు మరియు ఒక మహిళ యొక్క మృతదేహాలను గుర్తించారన్నారు..

హతమైన మావోయిస్టులు నక్సల్ దళం డివిజనల్ కమాండర్ స్థాయి సభ్యులు.ఎన్‌కౌంటర్లో మృతి చెందిన మహిళ మావోయిస్టు అగ్రనేత భార్యని సమాచారం. నిర్మల్ కడెం మండలంలో ఎదురు కాల్పులు జరిగిన ప్రాంతం నుండి.పోలీసులు INSAS రైఫిల్ ,మరియు సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ (SLR)ని స్వాధీనం పంచుకున్నట్టు పోలీసు అధికారి వార్తా  సంస్థకు తెలిపారు.