వివేకానంద ఆలోచన విధానమే మార్గదర్శకం
మహారాష్ట్ర మాజీ గవర్నర్ సాగర్ జీ !
(J. Surender Kumar)
మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ RSS కార్యకర్తగా ప్రారంభం అయ్యి, దేశ ప్రధాని స్థాయిలో ఉన్నారని, సాధించాలనే తపన ఉంటే సాధించలేనిది అంటూ ఏది లేదని, యువత ఆ దిశగా ముందుకు సాగాలని.మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అన్నారు.

జగిత్యాల్ పట్టణంలో జరుగుతున్న ఏబీవీపీ 41వ రాష్ట్ర మహాసభల్లో శనివారం సాగర్ జి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరీజీ యువ పురస్కార్ అవార్డు ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏబీవీపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి నుండి జాతీయ కార్యదర్శి వరకు బాధ్యతలు నిర్వహించిన స్వర్గీయ జనమంచి గౌరీ శంకర్ స్మారకంగా ఏబీవీపీ తెలంగాణ శాఖ 2004 నుండి సామాజిక సేవా రంగంలో కృషిచేసిన 45 సంవత్సరాల లోపు యువతకు ఈ అవార్డును ప్రధానం చేస్తుంది. అవార్డు కింద 25 వేల రూపాయల నగదు తో పాటు ప్రశంశ పత్రాన్ని అందజేస్తారు
ఈ సంవత్సరానికి గాను హైదరాబాదుకు చెందిన శ్రావ్య రెడ్డికి అందజేశారు.

శ్రావ్య రెడ్డి వి అండ్ షి అనే స్వచ్చంద సంస్థ ద్వారా ఒంటరి మహిళల్లో ఆత్మవిశ్వాసం కల్పించి వారికి ఉపాధి కల్పించే ప్రాజెక్టులో గత కొన్ని సంవత్సరాలుగా కృషి చేస్తోంది. కరోనా సమయంలో నిరుపేదలకు, మురికివాడల్లో ఉండే ప్రజలకు ఆహారాన్ని అందజేయడమే కాకుండా ఉచితంగా శానిటైజర్లు, మాస్కులు అందజేసింది. ఆమె సేవలకు గాను పలు సంస్థలు అవార్డులు అందజేశాయి.

గౌరీజీ యువ పురస్కారాన్ని శ్రావ్య రెడ్డి కి మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా సాగర్ జి మాట్లాడుతూ.
.స్వామి వివేకానంద ఆలోచన విధానమే దేశానికి మార్గదర్శకం అన్నారు..50 ఏళ్ల క్రితం ఉస్మానియా యూనివార్సిటీలో లా కళాశాల అధ్యక్షునిగా పనిచేశానన్నారు. తాను ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ఢిల్లీ కి రాజైన తల్లికి కొడుకు అన్న విధంగా ఎబివిపి నాకు తల్లీ లాంటిదని అన్నారు. మార్పు అనేది సహజమని మార్పు సమాజంలో జరగకపోతే మృత్యువు తో సమానం అన్నారు. వ్యక్తులు కూడా సమాజానికి అనుగుణంగా మార్పు చెందాలన్నారు.

నేటి యువత భవిష్యత్ భవిత అని, దేశ పునర్నిర్మాణం లో యువత పాత్ర కీలకమని అన్నారు., . ఈ దేశంలో కమ్యూనిజం, క్యాపిటలిజం పూర్తిగా విఫలమయ్యాయని ఈ దేశానికి సనాతన ధర్మమే శరణ్యమన్నారు., వివేకానంద ఆలోచన విధానమే ఈ దేశానికి మార్గదర్శనం అని
కాలే కడుపు ఉంటే నువ్వేం ఆలోచించలేవు అనే విశ్వ జనీనా సిద్ధంతం కు నిర్వచనం ఇచ్చిన మహనీయుడు వివేకానంద అని అన్నారు. భారత దేశాన్ని కించపరిచేలా మాట్లాడే ఆలోచన విధానాన్ని మానుకోవాలన్నారు.
మోదీ నాయకత్వం లో భారతదేశం G-21 సమావేశాలకు ఆతిథ్యం ఇస్తుందని, ఇది మనందరికీ గర్వకారణం అన్నారు. G20 సదస్సులో వసుదైక కుటుంబం, సర్వమత సమ భావన అనే భారతీయ విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం మనకు కలుగుతుందన్నారు.

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ రచన సమయంలో స్వేచ్ఛ, సమానత్వం తో పాటుగా, సౌబ్రాతృత్వం అనే పదాన్ని రాజ్యాంగ పీఠికలో చేర్చడం జరిగిందన్నారు. అంబేద్కర్ విగ్రహాలను * స్టేట్యూ ఆఫ్ ఫ్రాటార్నిటి * గా పిలవాలని విద్యా సాగర్ రావు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ పెట్టె 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి కూడా స్టాట్యూ ఆఫ్ ప్యాటర్నటి గా పిలవాలని తాను ముఖ్యమంత్రి కెసిఆర్ ను.కలిసి కోరుతానన్నారు. ఈ కార్యక్రమంలో గౌరీజీ యువ పురస్కార్ అవార్డు గ్రహీత శ్రావ్య రెడ్డి, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ జానారెడ్డి, ఝాన్సీ, రాష్ట్రీయ కళా మంచ్ జాతీయ సభ్యులు చక్రవర్తుల వేణు, రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

వాల్మీకి ఆవాసాన్ని సందర్శించిన సాగర్ జి !
వాల్మీకి ఆవాస నూతన భవన నిర్మాణం కు తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని మాజీ గవర్నర్ సాగర్ జి అన్నారు.
జగిత్యాల పట్టణంలో గత 30 సంవత్సరాల నుండి సేవా భారతి ఆధ్వర్యంలో వాల్మీకి ఆవాసము కొనసాగుతున్నది. ఇందులో గ్రామీణ నిరుపేద విద్యార్థులు 43 మంది ఉన్నారు. ఆవాసానికి శాశ్వత భవనం లేనందున సమాజంలోని అందరి సహకారంతో నూతన భవనాన్ని నిర్మించుకోవడానికి కార్యాచరణ సిద్ధం చేశారు.. ఈ మేరకు సాగర్ జి తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తారని

నిర్వాహకులకు హామీ ఇచ్చారు.. ఆవాస కమిటీ సేవాభారతి ని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యవాహ శ్రీ కాచం రమేష్ , ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ దేవేందర్ , విభాగ్ సహ కార్యవాహ గోనే భూమయ్య ,బిజెపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు మోరపల్లి సత్యనారాయణ రావు , ఆవాస కార్యదర్శి శ్రీ.నందెల్లి మదన్ మోహన్ రావు , ఆవాస కమిటీ సభ్యులు శ్రీ.సంపూర్ణ చారి మరియు శ్రీ.సాయి మధుకర్ తదితరులు పాల్గొన్నారు.