జగిత్యాల జిల్లాలో.
(J. Surender Kumar)
జగిత్యాల జిల్లాలో ఇటీవల జరిగిన 11 మాతృ మరణాల సంఘటనల పై శుక్రవారం కలెక్టర్ జి రవి సమీక్ష సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ అధ్యక్షతన జిల్లా లో జరిగిన మొత్తం 11 మాతృ మరణాలపై ఆయన వారి బంధువులను పూర్తి వివరాలు, మరణానికి గల కారణాలను, అడిగి తెలుసుకున్నారు. ప్రతి మరణానికి సంబంధించి వైద్యులు, మరియు వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా ఉందా ? అని మరియు ఆ మరణించిన వ్యక్తి యొక్క గత ఆరోగ్య చరిత్రను, మరియు వైద్యం అందించిన ఆసుపత్రి రికార్డులను పరీక్షించారు., దూర ప్రాంతాలను వచ్చే పేదవారికి సరైన వసతులు కల్పించి చికిత్స అందించాలని సూచించారు., ప్రతి మాతృ మరణాలని విశ్లేషించాలని అధికారులకు సూచించారు. మరణానికి గల కారణాలను తెలుసుకొని భవిష్యత్తులో మాతృ మరణాలను తగ్గించాలని, మళ్లీ జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి ఎస్ లత, మంద మకరంద్, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుప్పాల శ్రీధర్, జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్. శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సమియోద్దిన్, డాక్టర్ ఎ. శ్రీనివాస్ డాక్టర్ జైపాల్ రెడ్డి, జిల్లా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సుధీర్, డాక్టర్ సాయి సుధా, డాక్టర్ భీమేష్ మరియు జాతీయ ఆరోగ్య మిషన్ జిల్లా అధికారి స్వామి,సూపర్వైజర్లు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు