మీడియా అకాడమీ చైర్మన్ జన్మదిన వేడుకలు!

వేములవాడలో..

( J. Surender Kumar)

మీడియా అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే (H-143) రాష్ట్ర అధ్యక్షులు, అల్లం నారాయణ జన్మదిన వేడుకలను వేములవాడ జర్నలిస్టులు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వేములవాడ ప్రెస్ క్లబ్ సభ్యులు ఆకాంక్షించారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన అల్లం నారాయణ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ చేశారు.

మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఎనలేని సేవలను అందిస్తు, కోవిడ్ బారిన పడిన జర్నలిస్టులకు,వివిధ కారణాల చేత మృత్యువాతకు గురైన జర్నలిస్టుల కుటుంబాలకు, అనారోగ్యంతో జర్నలిస్టు వృత్తికి దూరమైన విలేకరులకు, ప్రమాదాల్లో తీవ్ర గాయాల పాలైన జర్నలిస్టులకు సుమారు 10 కోట్ల రూపాయల నిధిని కేటాయించిన ఘనత అల్లం నారాయణ కు దక్కుతుందని ఈ సందర్భంగా ఆ సంఘ రాష్ట్రం ఉపాధ్యక్షుడు లాయక్ పాషా అన్నారు..
ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పాషా తాహేర్, రేగుల రాంప్రసాద్, కొలిపాక నర్సయ్య, జిల్లా రమేష్, కొత్త్వాల్ శ్రీనివాస్, అబ్బగోని రవీందర్, జితేందర్, ప్రవీణ్, సందీప్, ప్రదీప్, రజనీకాంత్, శ్రీకాంత్, జగన్, ప్రశాంత్ లతోపాటు ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

లక్షలాది ఉద్యోగ, కుటుంబాలను కించపరిచింది!
పాత పింఛన్ విధానంపై కేంద్రం వైఖరి!
TSCPSEU నాయకుడు పవన్ కుమార్!

లోక్ సభలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో పాత పింఛన్ విధానంపై తాము ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని సోమవారం కేంద్ర మంత్రి చెప్పిన సమాధానం
దేశంలోని 84 లక్షల సి పి ఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలను కించపరిచే విధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కిం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మ్యాన పవన్ కుమార్ మంగళవారం ప్రకటన లో ఆరోపించారు.
హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఓవైసీ పాత పెన్షన్ విధానం రద్దుతో పాటు నూతన పెన్షన్ విధానం రద్దుపై అడిగిన ప్రశ్నలపై కేంద్ర మంత్రి ఉద్యోగుల, ఉపాధ్యా యుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్లో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి భారత ప్రభుత్వం పరిశీలనలో ఎలాంటి ప్రతిపాదనలేదని కేంద్రమంత్రి చెప్పడం దేశవ్యాప్తంగా ఉన్న 84 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలకు సామాజిక భద్రతపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియచేస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు. రాజస్థాన్, చత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదన లకు ప్రతిస్పందనగా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం 2013 కింద ఉపసంహరణ నిబంధనలు లేవని నిబంధనలను 2015లో కూడా ఈ నిబంధనలో పొందుపరచలేదని వీటిని కాలానుగుణంగా సవరించినట్టు పేర్కొన్నారు.. ఇప్పటికే రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ జార్ఖండ్, పంజాబ్ రాష్ట్రాలు తమ రాష్ట్ర ప్రభు ఉద్యోగుల నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసుకుంటున్నాయని, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కేవలం 0.9 శాతం ఓట్లతోనే ఫలితాలు తారుమారయ్యాయన్న విషయాన్ని అధికారంలో ఉన్న పార్టీలు గుర్తుంచుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.
జగిత్యాల జిల్లా అధ్యక్షులు గంగాధరి మహేష్, ప్రధాన కార్యదర్శి సర్వ సతీశ్, కోశాధికారి గొల్లపల్లి మహేష్ వీరబత్తిని శ్రీనివాస్, బండారి సతీష్, సందుబట్ల రమేష్,.బోగ శ్రీనివాస్ తదితరులు ప్రకటనలో ఆరోపించారు.