ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, లక్ష్మణ్ కుమార్ లకు సన్మానం!

కాంగ్రెస్ శ్రేణుల ఆధ్వర్యంలో..

(J. Surender Kumar)

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సమీక్ష కమిటీ, సభ్యులుగా నియమితులైన పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరోసారి నియమితులైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా సన్మానించి అభినందించారు.

జగిత్యాల ఇందిరా భవన్ లో ఆదివారం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు వారిని కలిసి పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లక్ష్మణ్ కుమార్ సన్మానించారు.

కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, తాటిపర్తి విజయలక్ష్మి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు సంగనభట్ల దినేష్ ,- దేవేందర్ రెడ్డి, కౌన్సిలర్ దుర్గయ్య, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, తదితరులు ఉన్నారు.