ఎంపీ అరవింద్ ఇంటి ముందు ధర్నా చేయాలి!

టి పి సి సి నాయకులు జువ్వాడి కృష్ణారావు

(J. Surender Kumar)

బిజెపి నాయకులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయడం కాదని, ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బాండ్ పేపర్ ద్వారా హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసిన స్థానిక పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ ఇంటి ముందు ధర్నా చేయాలని టిపిసిసి నాయకుడు జువ్వాడి కృష్ణారావు అన్నారు.. బుధవారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. రైతు రుణమాఫీ చేయాలంటూ బిజెపి నాయకులు దొంగ నాటకాలు ఆడుచున్నారని, దొంగ ధర్నాలు చేయడం కాదని గతంలో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో దేశవ్యాప్తంగా రైతులకు ఏకకాలంలో రుణము మొత్తాలను మాఫీ చేసిందని, కానీ నేడు బిజెపి ప్రభుత్వం ఆదాని, అంబానీ ,నీరవ్ మోడీ ,విజయ్ మాల్యా, ఇతర బడా పారిశ్రామికవేత్తలకు పెట్టుబడిదారులకు లక్షలాది కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసిందన్నారు. ప్రజలకు పేద రైతులకు మాత్రం ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకుండా ఈరోజు దొంగ ధర్నాలకు దిగుతున్నారని జువ్వాడి మండిపడ్డారు. టిఆర్ఎస్ ,బిజెపి పార్టీ తోడుదొంగలా కలిసి అధికారంలో ఉండి ధర్నాలు చేయడం ఏమిటని ? రుణమాఫీ చేసి బీద ప్రజల పట్ల రైతుల పట్ల తమ చిత్తశుద్ధిఏపాటిదో నిరూపించుకోవాలని అన్నారు బిజెపి టిఆర్ఎస్ పార్టీల నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని వీరి వ్యవహారం గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీలా ఉందని ఈ రెండు పార్టీలకు ప్రజలు తగిన సమయంలో కరు కాల్చి వాత పెడతారని జువ్వాడి కృష్ణారావు విమర్శించారు.