J. Surender Kumar,.
సింగపూర్ లో ఇటీవల ప్రమాదంలో మృతిచెందిన జగిత్యాల జిల్లావాసి కుటుంబానికి సహచరులు₹23 లక్షల ఆర్థికసాయం అందించి అండగా నిలిచారు.
జగిత్యాల మండలం రఘురాములకోట గ్రామానికి చెందిన వన్నల మల్లేశం (41) గత నెల 25 న ప్రమాదవశాత్తు సింగపూర్ లో. మృతి చెందాడు.. విషయం తెలుసుకున్న సింగపూర్ లో నివసిస్తున్న జగిత్యాల ప్రాంతానికి చెందిన పెద్ది చంద్రశేఖర్ రెడ్డి, మంచాల మహేష్, మరియు సింగపూర్ తెలుగు సమాజం (STS) నిరుపేదయినా మల్లేశం మృతి పట్ల వెంటనే స్పందించి ఆ కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని అనుకున్నారు.
తక్షణ సహాయంగా సింగపూర్ తెలుగు సమాజం (STS) సభ్యులయిన బొమ్మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రూ 50,000 మరియు రుద్రా భూంరాజ్, రూ 25,000 మరియు మల్లేశం పనిచేస్తున్న కంపెనీ వారు రూ 50,000 మల్లేశం కుటుంబానికి అందచేశారు.
సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు కోటి రెడ్డి ఆధ్వర్యంలో, పెద్ది చంద్రశేఖర్ రెడ్డి, మంచాల మహేష్ ల సహకారంతో పలువురు దాతలు నిధులను అందించారు.
తెలుగు సమాజం ద్వారా రూ 3.69 లక్షలు, మల్లేశం పనిచేస్తున్న P.E.C – (P.G.S )LTD. కంపెనీ యాజమాన్యం, అధికారులు, సిబ్బంది రూ 18.11 లక్షలు మొత్తం రూ 23.05 లక్షల నిధులు జామకాగా మల్లేశం కుమారులైన వన్నల రిషిత్ కుమార్, పేరిట రూ 10.50 లక్షలు, వన్నల మిథునరాజ్, పేరిట రూ 10.50 లక్షలు చొప్పున జగిత్యాల లోని Bank of Maharastra లో fixed డిపాజిట్ చేయించి బాండ్లను మల్లేశం భార్య జ్యోత్స్న కు శుక్రవారం అందించారు. మరో రూ 80 వేలు పిల్లల బ్యాంకు ఖాతాలో జమచేయగా మిగిలిన రూ. 1.25 లక్షలను ఖర్చుల నిమిత్తం మల్లేశం భార్యకు అందించారు.
దాతల సహకారంతో రూ. 23.05 లక్షలు జామ కాగా కంపెనీ నుండి ప్రభుత్వం ద్వారా insurance మొత్తాన్ని మంజూరు చేయించేందుకు కృషిచేస్తున్నట్లు పెద్ది చంద్రశేఖర్ రెడ్డి, మంచాల మహేష్ లు తెలిపారు.