ధర్మపురి క్షేత్రంలో..
J. Surender Kumar)
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం శ్రీ రుద్ర సహిత శత చండీయాగం పూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిసింది.

సంఘనపట్ల దిలీప్ శర్మ, వైదిక నిర్వహణ పర్యవేక్షణలో స్థానిక శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో యాగం శుక్రవారం ఉదయం వేదమంత్రాల ఘోషలో

. ఆరంభమైంది. దాదాపు 25 మంది వేద పండితుల (రిత్వికులు) వేదమంత్రాల ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఆదివారం ఆలయ ప్రాంగణంలో.అన్నదాన కార్యక్రమం జరిగింది.

కాగజ్ నగర్ పట్టణానికి చెందిన పెండ్యాల కిషన్ శర్మ లలిత, త్రినాధ్ శర్మ దివ్య, బలిజ పెళ్లి సాయి ఫణీ చంద్ర శ్వేత దంపతులు యాగనిర్వహణ, పూజాది ద్రవ్యాలను,ఆర్థిక చేయూతనిచ్చారు. లోక కళ్యాణం కోసం నిర్వహించిన యాగం పూర్ణాహుతి కార్యక్రమానికి భారీ సంఖ్య భక్తులు తరలి వచ్చారు.
