(J.Surender Kumar)
నూతన సంవత్సరం రెండవ తేదీన జరగనున్న (2023, జనవరి 2న) ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు, ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం. ముస్తాబవుతుంది.
ముక్కోటి రోజున ఉదయం 2.గంటల 30. నిమిషాలకు
లక్ష్మీ సమేత యోగ, ఉగ్ర నరసింహ, శ్రీ వెంకటేశ్వర స్వాముల మూలవిరాట్టుకు మహాక్షీరాభిషేకం నిర్వహిస్తారు. నాలుగు గంటల ప్రాంతంలో. వైకుంఠ ద్వారం వద్ద పుష్ప వేదికపై స్వామివారి ఆశీస్సులు గావించి, ప్రత్యేక పూజలు సహస్రనామార్చనలు, నివేదనలు ,మంత్రపుష్పం, వేదగోష, మహా ఆశీర్వచనములు. అర్చకులు,వేద పండితులు నిర్వహిస్తారు.

5 గంటల ప్రాంతంలో మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో వైకుంఠ ద్వారానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి మహాస్వామి, శ్రీ శ్రీ విశ్వ యోగి విశ్వంజీ మహారాజ్ లు, వైకుంఠ ద్వారం తెరిచి స్వామి వారిని దర్శించుకుంటారు.. భక్తుల దర్శనానంతరం. స్వామి వారిని వీధుల్లో ఊరేగిస్తారు.

ఉత్సవాలను పకడ్బందీగా, అందంగా, నయానానందంగా, నిర్వహించడానికి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, కార్యనిర్మాణాధికారి సంకటాల శ్రీనివాస్ ,సిబ్బంది , అర్చకులు, వేద పండితులు, ప్రణాళిక బద్ధంగా కార్యాచరణలు సిద్ధం చేశారు. రంగు రంగుల దీపాలంకరణ, వివిధ రకాలైన పువ్వులతో అలంకరణ అనుబంధ ఆలయాలను పూల మాయం చేయడం.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు, పార్కింగ్ , ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్, వైద్యశాఖ, స్థానిక మున్సిపల్. అధికారులతో సమీక్ష సమావేశాలు తదితర అంశాలపై. చర్చిస్తున్నారు. సామాన్య భక్తులకు అసౌకర్యాలు కలగకుండా, ముక్కోటి ద్వార దర్శనం కోసం. అభివృద్ధి కమిటీ సభ్యులు, అధికారులు చర్చిస్తున్నట్లు సమాచారం.
