( J. Surender Kumar).
నూతన సంవత్సరం జనవరి 2న ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరగనున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు జగిత్యాల కలెక్టర్ రవిని, దేవస్థానం పక్షాన మంగళవారం ఆహ్వానించారు.

ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు రామయ్య, అధికారి శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ లు కలెక్టర్ ను కలిసి స్వామివారి ప్రసాదం, స్వామి వారి శేష వస్త్రం, ఆహ్వాన పత్రిక ను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాట్ల గురించి కలెక్టర్ వారిని వివరాలు అడిగారు, భక్తజనం కు అసౌకర్యం కలగకుండా ముందస్తు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి వీరిని ఆదేశించారు. ఇదే తరహాలో అదనపు కలెక్టర్ మకరందం, జెడ్పి చైర్పర్సన్ దావ వసంతల ను కలిసి ఉత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.
