మహామాన్యని స్మరించుకుందాం!
దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో అనేక మంది వివిధ రూపాల్లో తమ వంతు పాత్ర పోషించారు. ఇందులో పండిట్ మదన్ మోహన్ మాలవ్య. బెనారస్ ఒకరు.హిందూ విశ్వవిద్యాలయం వ్యవస్థాపకుడైన ఆయన భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా నాలుగు సార్లు పనిచేశారు. మహామాన్య గా పేరు పొందారు.
మాలవ్యా బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ను వారణాసిలో 1915లో స్థాపించారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం మరియు ప్రపంచంలోనే పెద్ద విశ్వవిద్యాలయంగా ప్రసిద్ధి పొందింది..ఇందులో 12,000 లకు పైగా విద్యార్థులు కళలు,విజ్ఞానశాస్త్రము, ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీలలో విద్యనభ్యసిస్తున్నారు.
మాలవ్యా ఆ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా 1919 నుండి 1938 వరకు పనిచేశారు.
1861, డిసెంబర్ 25 తేదిన అలహాబాదులో మూనాదేవి, బ్రిజ్‌నాథ్ దంపతులకు జన్మించిన మదన్ మోహన్ మాలవ్య పూర్వీకులు మధ్యప్రదేశ్‌లోని మాల్వా ప్రాంతం నుండి వలస వచ్చారట. అందుకే ఆయన ఇంటి పేరు కూడా మాలవ్యగా సార్థకమైంది. ఆయన అసలు ఇంటి పేరు చతుర్వేది.
పాఠశాల రోజుల నుండే మకరంద్ అనే కలంపేరుతో కవిత్వంరాయడంప్రారంభించారు మాలవ్య. 1879లో అలహాబాద్ సెంట్రల్ కళాశాల నుండి మెట్రిక్యులేషన్ పూర్తి చేసిన ఆయన, కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బి.ఎ.లో పట్టభద్రులైనారు. తర్వాత ఉపాధ్యాయునిగా తనజీవితాన్నిమొదలుపెట్టారు.అంతకు ముందే ఆయన ‘ది ఇండియన్ ఒపీనియన్’ అనే పత్రికకు సబ్ ఎడిటర్‌గా పనిచేశారు.అలాగే న్యాయశాస్త్రంలో కూడా పట్టా పొందారు.
1907లో మాలవ్య స్వయంగా ‘అభ్యుదయ’ అనే వార్తాపత్రిక ప్రారంభించారు. తర్వాత ‘లీడర్’ పేరుతో ఆంగ్ల పత్రికను ప్రారంభించారు. తర్వాత నష్టాల్లో ఉన్న హిందుస్తాన్ టైమ్స్ పత్రికను కూడా తీసుకొని నడిపారు. అయితే బహుకొద్ది కాలమే ఆయన దానికి ఛైర్మన్‌గా ఉన్నారు
1908లో బ్రిటీష్ ప్రభుత్వం పత్రికలపై ఆంక్షలు విధించినప్పుడు. వాటికి వ్యతిరేకంగా అలహాబాద్‌లో అఖిలభారత కాన్ఫరెన్సును నిర్వహించారు మాలవ్య.
బ్రిటీష్ నియంతల రాజ్యానికి ఊతమిచ్చేందుకుప్రారంభించిన సైమన్ కమీషన్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన నేతల్లో ఒకరు మాలవ్య. 1931లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీతో కలిసి కాంగ్రేసు పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ఆయన,1922లో హిందు మహాసభఅధ్యక్షుడుగా పనిచేశారు.”సత్యమేవ జయతే” అనే నినాదాన్ని తొలినాళ్లలో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది మాలవ్యనే.
1922 లో చౌరీ చౌరా దాడుల ఘటనలో మరణశిక్ష పడిన 225 మంది స్వాతంత్ర్య సమరయోధులు, సాధారణ ప్రజానీకం తరపున వాదించి వారిలో 153 మందికి ఆ శిక్ష పడకుండా కాపాడారు మాలవ్య.
గంగా నది పరిరక్షణ కోసం ‘గంగా మహాసభ’ పేరుతో ఉద్యమాన్ని కూడా లేవదీశారు మాలవ్య.భారతీయ స్కౌట్స్ మరియు గైడ్సు వ్యవస్థాపకులలో మాలవ్య ఒకరు.1932లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతిపాదించిన పూనా పాక్ట్ అగ్రిమెంట్ పై ఆయనతో కలిసి సంతకం చేశారు మాలవ్య. 1932 ఆగష్టులో జరిగిన రెండవ రౌండు టేబులు సమావేశం తరువాత రామ్సే మెక్టోనాల్డ్ ప్రధానమంత్రిగా ఉన్న బ్రిటిషు ప్రభుత్వం కమ్యూనల్ అవార్డును ప్రకటించింది. ప్రభుత్వం అల్ప సంఖ్యాక మతస్తులకు ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేయడం ఈ అవార్డు లక్ష్యం. అయితే ముస్లిములు, సిక్ఖులతో పాటు, దళితులను కూడా అల్ప సంఖ్యాక మతస్తులుగా ఈ అవార్డు ప్రకటించింది.
జీవితకాలం మొత్తం బ్రహ్మచారిగానే గడిపిన మాలవ్య నవంబరు 12, 1946లో మరణించారు.
డిసెంబర్ 24,2014 న మదన్ మోహన్ మాలవ్యను ఆయన మరణాంతరం భారతదేశంలోని ప్రతిష్ఠాత్మక అవార్డు భారతరత్న వరించింది.విద్యా వేత్తగా, స్వాతంత్ర్య సమర యోధుడిగా పేరు పొందిన మాలవ్యని నిత్యం స్మరించుకోవాలి.
వ్యాసకర్త :
యం.రాం ప్రదీప్ తిరువూరు 9492712836