నిజామాబాద్‌ పీఎఫ్‌ఐ కేసులో.11 మందిపై ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌

ఒకరు ఆంధ్ర,10మంది తెలంగాణ వారు ఉన్నారు!

(J. Surender Kumar)

నిజామాబాద్‌ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కేసులో 11 మందిపై చార్జిషీట్‌ దాఖలు చేసినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) శుక్రవారం వెల్లడించింది.
ఉగ్రవాద శిక్షణా శిబిరాల నిర్వహణ, పీఎఫ్‌ఐ ఉగ్రవాద చర్యలకు వ్యక్తులను నియమించడం పై హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో గురువారం 11 మందిపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. 11 మందిలో ఒక్కరు ఆంధ్ర , పదిమంది తెలంగాణ కు చెందినవారు.
నిజామాబాద్‌ కు చెందిన అబ్దుల్ ఖాదర్, అబ్దుల్ అహద్, నెల్లూరుకు చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్, జగిత్యాలకు చెందిన అబ్దుల్ సలీమ్, నిజామాబాద్‌కు చెందిన షేక్ షాదుల్లా, ఆదిలాబాద్‌కు చెందిన ఫిరోజ్ ఖాన్, జగిత్యాలకు చెందిన మహ్మద్ ఉస్మాన్ హక్ ఉస్మాన్, నిజామాబాద్‌కు చెందిన సయ్యద్ యాహియా,  సమీర్‌లను. చార్జిషీట్లో  ఎన్‌ఐఏ పేర్కొంది. నిజామాబాద్‌కు చెందిన ఖురేషీ, నిజామాబాద్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ ముబీన్, కరీంనగర్‌కు చెందిన మహ్మద్ ఇర్ఫాన్ లు ఉన్నారు.

ఈ ఏడాది జులై 4న నిజామాబాద్‌లో కేసు నమోదు కాగా, ఆగస్టు 26న ఎన్‌ఐఏ విచారణ చేపట్టింది.
నిందితులు భారత ప్రభుత్వంతో పాటు ఇతర సంస్థలు మరియు వ్యక్తులపై ద్వేషం మరియు విషంతో నిండిన ప్రసంగాల ద్వారా మోసపూరిత ముస్లిం యువకులను సమూలంగా మార్చి PFI లోకి చేర్చుకుంటున్నారని తమ దర్యాప్తులో తేలిందని చార్జిషీట్లు  పేర్కొన్నట్టు సమాచారం.
ఒకసారి PFIలో రిక్రూట్ అయిన తర్వాత, ముస్లిం యువకులను  యోగా క్లాసులు, మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ (PE), బిగినర్స్ కోర్సు (BC), ముసుగులో  PFI నిర్వహించిన శిక్షణా శిబిరాలకు పంపబడ్డారు, అక్కడ వారికి రోజువారీ కర్రలు,కత్తులు ఉపయోగించడంలో శిక్షణ ఇవ్వబడింది ( కత్తి, కొడవలి మరియు ఇనుప రాడ్లు) గొంతు, కడుపు మరియు తల వంటి హాని కలిగించే శరీర భాగాలపై దాడి చేయడం ద్వారా హతమార్చడం ఎలా ?  ఉగ్రవాద చర్యల కోసం పి ఎఫ్ ఐ సెక్షన్ శిబిరాలను ఏర్పాటు చేసింది, ”ఎన్ఐఎ  చార్జ్ షీట్ లో పేర్కొంది.

భారతీయ శిక్షాస్మృతి, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద 11 మంది నిందితులపై ఎన్‌ఐఏ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.
గత కొన్ని నెలలుగా, NIA PFI కి సంబంధించి అనేక కేసులు నమోదు చేసింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్‌ఐఏ ఈ కేసుకు సంబంధించి పలువురిని అరెస్టు చేసింది.