ఓ ఇల్లు రెండు రాష్ట్రాలకు సరిహద్దు అయింది !

రెండు రాష్ట్రాలకు వారు ట్యాక్స్ చెల్లిస్తున్నారు.
ఇంటి సగభాగం మహారాష్ట్ర పంచాయతీలో
మరో సగభాగం తెలంగాణ పంచాయతీలో..

(J. Surender Kumar)

మహారాష్ట్రలోని మహరాజ్‌గూడ గ్రామం లోని ఓ ఇంటిలోని నాలుగు గదులు తెలంగాణ ప్రభుత్వ పరిధిలోకి, మిగతా భాగం మహారాష్ట్ర పరిధిలో ఉండి రాష్ట్రాల సరిహద్దు రాయి తరహాలో నిలిచింది.
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని మహారాజ్ గూడ గ్రామంలోని ఒక ఇల్లు రెండు రాష్ట్రాల మధ్య చిక్కుకుంది - 53 ఏళ్ల సర్వే తర్వాత దానిని సగానికి విభజించి, ఒకటి పశ్చిమ రాష్ట్రంలో (మహారాష్ట్ర) మరొ ఇంటి సగభాగం ఇప్పుడు తెలంగాణాలో విడిచిపెట్టింది.  మహరాజ్‌గూడ గ్రామంలోని ఇంటిలోని నాలుగు గదులు తెలంగాణ ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి.

  ఉత్తమ్ పవార్ ఈ విషయం వార్తా సంస్థ ANI కి వివరించారు. తన కుటుంబం రెండు రాష్ట్రాలకు పంచాయతీలకు పన్నులు చెల్లిస్తుంది, అయితే తెలంగాణ ప్రభుత్వం నుండి మరిన్ని

ఆ ఇంటిలో నాలుగు గదులు తెలంగాణలోని

ప్రయోజనాలను పొందుతున్నామన్నారు.
“1969లో సరిహద్దు సర్వే చేసినప్పుడు, మా ఇంట్లో సగం మహారాష్ట్రలో, మిగిలిన సగం తెలంగాణలో ఉందని చెప్పారు. మాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. రెండు రాష్ట్రాల ,గ్రామపంచాయతీలకు, పన్నులు చెల్లిస్తున్నాం.. రెండు రాష్ట్రాల నుండి సంక్షేమ పథకాలను పొందుతున్నాం. అని వివరించారు.
ఇటీవల రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దులో ఉన్న అనేక పైగా గ్రామాల నివాసితులు తమను క్రాస్‌ ఓవర్‌కు అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వంలో రోడ్లు మరియు నీటితో సహా ప్రాథమిక సౌకర్యాల కోసం తాము పోరాడుతున్నామని, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మరియు అతని పాలన భారత రాష్ట్ర సమితి అందించే సంక్షేమ పథకాలలో మాకు వర్తింపజేయాలని వారు కోరుతున్నారు. మహారాష్ట్రలో పెన్షన్ ₹1000/- రూపాయలు, వృద్ధులకు 10 కిలోలు రేషన్ బియ్యం. ఇంతకు రెట్టింపు తెలంగాణలో లభిస్తుందని వారు ఏఎన్ఐ వార్తా సంస్థ పత్రిక వివరించారు.