ప్రజావాణి అర్జీలకు పరిష్కారం చూపాలి కలెక్టర్ !

(J.Surender Kumar)

ప్రజావాణిలో ప్రజల నుండి స్వీకరించిన అర్జీలు, దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ జి.రవి జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్లు మందా మకరంద్, బిఎస్ లత తో కలిసి హాజరై ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. పెండింగ్ లో ఉన్న అర్జీలపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అన్నారు. రెవెన్యూ, భూ సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపాలని ఆదేశించారు.
ప్రజావాణికి మొత్తం 16 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు.

ఆకస్మిక తనిఖీలు!

అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు  మంద మకరంద్ సోమవారం తెల్లవారుజామున  జగిత్యాల మున్సిపల్ పరిధిలో ఆకస్మిక తనిఖీ చేశారు
అంగడి బజార్ ఏరియాలో పారిశుద్ధ్య కార్మికుల బయోమెట్రిక్ హజర్ పరిశీలించారు.  సమయానికి కార్మికులు హాజరు కావాలని ఆదేశించారు.   పారిశుద్ధ పనులు సక్రమంగా జరగాలని సక్రమంగా పనిచేయని వారికి కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..

ట్రాక్టర్, ఆటో,.మున్సిాలిటీ అన్ని రకాల వాహనాలు. డీజిల్ ఇష్యూ కూపన్లు రికార్డ్స్ పరిశీలించారు.. గొల్లపల్లి రోడ్ లో డంపింగ్ యార్డ్ పరిశీలించారు పర్యటనలో మున్సిపల్ కమిషనర్ ఇంచర్జ్ రాజేశ్వర్  శానిటేషన్ ఇన్స్పెక్టర్ సిబ్బంది పాల్గొన్నారు.