(J. SURENDER KUMAR)
జనసేన అధినేత నేత పవన్ కళ్యాణ్ కొత్త ప్రచార వాహన రథం ( వాహనంకు పెట్టుకున్న పేరు’ వారాహి’) కి కొండగట్టు లో ప్రత్యేక పూజలు చేయించనున్నట్లు సమాచారం.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఆర్ఓ ఒకరు. బుధవారం కొండగట్టు ఆలయ అర్చకుడికి (పదవి విరమణ చేసిన) .ఫోన్ చేసి సార్ నూతన వాహనం పూజ కొండగట్టు క్షేత్రంలో చేయించాలి, ముహూర్తం చూడాల్సిందిగా కోరినట్టు సమాచారం. తాను ముహూర్తం, తిథి ,వార నక్షత్రాలు చూసి సమాచారం ఇస్తానని అర్చకుడు పి ఆర్ ఓ వివరించినట్టు తెలిసింది. బుధవారం పగలు 3 నుంచి 5 గంటల సమయంలో పిఆర్ ఫోన్ చేసినట్టు తెలిసింది.

ఆంధ్రాలో చేపట్టబోయే పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార యాత్రకు పవన్ కళ్యాణ్ వినియోగించే వాహనంకు ”వారాహి ‘ అని నామకరణం చేశారు , ఈ వాహనంలో నే ఆయన ఆంధ్ర లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. కొండగట్టు. శ్రీ ఆంజనేయ స్వామి పవన్ కళ్యాణ్ కు నమ్మకమైన దైవం.

మొదటి నుంచి సెంటిమెంట్ కావడంతో, వాహన పూజ ఇక్కడే చేయాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం. దీనికి తోడు ఆయన కుటుంబం సినీ రంగంలో అంజనా ప్రొడక్షన్స్ సంస్థ కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఇది ఎలా ఉండగా ప్రజారాజ్యం పార్టీలో ఉండగా నటుడు పవన్ కళ్యాణ్ ఓసారి కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి నీ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 2014లో జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఆయన 2018 జనవరి 22న ఆమె కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి నాలుగు రోజులపాటు రాజకీయ పర్యటన సాగించారు.