శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో..
(J. Surender Kumar)
గురువారం జగిత్యాల లోని మాతా శిశు ఆసుపత్రి భవనంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రంలో గుర్తించబడిన 0-5సం. ల లోపు అతి తీవ్ర లోప పోషణ ఉన్న 19 మంది పిల్లలకు మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్( స్థానిక సంస్థల) మంద మకరంద్ మాట్లాడుతూ అతి తీవ్ర లోప పోషణ ఉన్న పిల్లలను ఏ విధంగా వేటిద్వారా గుర్తిస్తున్నారని అంగన్వాడి టీచర్లను వైద్యులను అడిగారు

పిల్లల వైద్య నిపుణులచే పర్యవేక్షణతో కూడిన అనుబంధ ఆహార కార్యక్రమం లో భాగంగా పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు..ప్రత్యేకంగా వచ్చిన SAM పిల్లల ఎత్తులు, బరువులు పరిశీలించారు. అదేవిధంగా అంగన్వాడి టీచర్లు ప్రతినెల నమోదు చేసే పిల్లల పెరుగుదల పర్యవేక్షణ కార్డులను పరిశీలించారు. అతి తీవ్ర లోప పోషణ పిల్లల తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ పిల్లల పోషణ పై దృష్టి సారించాలని అందులో భాగంగా పిల్లలు లోప పోషణకు గురి అయినప్పుడు వైద్యులను సంప్రదించడానికి కొంత సమయాన్ని పిల్లల కోసం వెచ్చిస్తే వారు భవిష్యత్తులో జీవితంలో ఎప్పటికీ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతారని తల్లిదండ్రులకు వివరించారు..అదేవిధంగా వైద్యులను సంప్రదించేటప్పుడు పాటించవలసిన మరియు తెలుసుకోవలసిన విషయాల గురించి తల్లిదండ్రులకు తెలిపారు. తదుపరి పిల్లల వైద్య నిపుణులు మాట్లాడుతూ లోప పోషణ ఉన్న పిల్లల యొక్క ఆహార ఆరోగ్యానికి సంబంధించి పలు సూచనలు చేశారు. జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ లోప పోషణ ఉన్న పిల్లలను గురించి చెప్తూ లోప పోషణ ఉన్న పిల్లలకు సరైన పోషణ ఆరోగ్య సేవలు వైద్యశాఖ తో కలిసి ప్రతినెల వైద్య శిబిరాన్ని ఏర్పరిచి లోప పోషణ ఉన్న పిల్లలకు ఆరోగ్య పరీక్షలు చేసి మందులు అందించడం, కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు .

దీనికి తల్లిదండ్రులందరు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ బి .నరేష్ ,RMO చంద్రశేఖర్ , పిల్లల వైద్య నిపణులు డాక్టర్ భూమేష్, డాక్టర్ పూర్ణచందర్ , డాక్టర్ సంతోషి , ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్, సిడిపిఓలు సంపద కుమారి, తిరుమలాదేవి ,వీరలక్ష్మి మరియు పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ మధు కుమార్ ,సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, పోషణ అభియాన్ సిబ్బంది పాల్గొన్నారు