జగిత్యాల మాతా శిశు ఆస్పత్రిలో ..
పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి..
(J.Surender Kumar)
జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆస్పత్రి లో స్థానిక రజకులకు దోభీగా అవకాశం కల్పించాలి..
టెండర్ ప్రక్రియను రజకుల కు అప్పగించాలి..రజకుల వృత్తికి చేయుతనివ్వాలి అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.,
ఇందిరా భవన్ లో శుక్రవారం రజక సంఘ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని కలిసి, నూతన ప్రభుత్వ ఆస్పత్రిలో ధోభీ పనులు తమకే అప్పగించాలని, తమకు మద్దతు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించారు. ఆస్పత్రి సూపరిండెంట్ తో ఫోన్ లో మాట్లాడారు., మాతా శిశు ఆస్పత్రిలో దోభీ పనులు చేసేందుకు స్థానిక రజకులకే అవకాశం కల్పించాలి. ఇప్పటికే రజకులకు కుల వృత్తి చేసుకునేందుకు పని లభించక వృత్తి కనుమరుగైతోంది. రజకులు ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. నూతనంగా ఏర్పాటైన ఆస్పత్రిలో రజకులకు దోభీ పనులు అప్పగించాలి., దోభీ టెండర్ ప్రక్రియలో స్థానిక రజ కులకు ప్రాధాన్యత ఇచ్చి, రజక కుల వృత్తికి చేయూతనివ్వాలి అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.