కలెక్టర్ జి. రవి
(J. Surender Kumar)
ప్రభుత్వ లక్ష్యాల సాధనలో బ్యాంకర్ల సహకరించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. సెప్టెంబర్ 2022 కు సంబంధించిన త్రైమాసిక సమీక్ష లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అర్హులైన లబ్ధిదారులకు తక్షణం రుణ సదుపాయం తక్షణమే అందించాలని ఆదేశించారు.
జిల్లాలోని బ్యాంకు రుణ లక్ష్యాలు సెప్టెంబర్ 30 నాటికి సంబంధించిన పలు అంశాలపై కలెక్టర్ శుక్రవారం సంబంధిత బ్యాంకు అధికారులు మరియు సంబంధిత ఏజెన్సీ సంస్థలతో డిసిసి మరియు డీఎల్ఆర్సి సమావేశం నిర్వహించారు. గత సమావేశంలో చర్చించిన అంశాల పట్ల బ్యాంకర్లు అధికారులు తీసుకున్న చర్యలను సమీక్షించారు.

జిల్లాలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద పెండింగ్ లో ఉన్న 18 యూనిట్లు తక్షణమే గ్రౌండ్ చేయడమే కాకుండా యూసి లు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయ రుణాలకు సంబంధించి ఖరీఫ్ 1293 కోట్లు, పంట రుణం 855 కోట్లు వ్యవసాయ టర్మ్ రుణాలు మంజూరు చేస్తూ, వార్షిక రుణ ప్రణాళిక కింద మొత్తం 1497 కోట్ల రుణాల్ని మంజూరు చేశామని వివరించారు.
అలాగే వీధి వ్యాపారులకు సంబంధించి మొదటి విడతలో 11294 మందికి రెండవ విడతలో 3454 మందికి రుణాలు మంజూరు చేసామని తెలిపారు.

మూడో విడత రుణాలు ఆశాజనకంగా లేవని దీనిపై అన్ని బ్యాంకులు తక్షణం అర్హులైన లబ్ధిదారులకు రుణ సదుపాయం అందించాలని సూచించారు.
అలాగే సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా రుణాల కింద 132 కోట్లు, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద 114 మందికి మంజూరు చేశామని తెలిపారు.
జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న స్వశక్తి సంఘాలకు 296 కోట్లు, పట్టణ ప్రాంత సంఘాలకు 30 కోట్లు అందించామని తెలిపారు.
జిల్లాలో ఇప్పటివరకు ప్రైవేటు బ్యాంకులు పలుమార్లు సమావేశం నిర్వహించినప్పటికీ కొన్ని స్కీం లలో ఆశించిన స్థాయిలో పురోగతి లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాంకర్లు స్టాండప్ ఇండియా స్కీం, డైరీ ఫార్మ్, ఫిషరీస్ పశుసంవర్ధక పథకాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్. లత, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మంద మకరంద్, లీడ్ బ్యాంకు మేనేజర్ పొన్న వెంకటరెడ్డి, ఆర్బీఐ ఎల్. డి. ఓ. సాయి చరణ్, నాబార్డ్ డి డి ఎం. మనోహర్ రెడ్డి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డిప్యూటీ రీజినల్ హెడ్ వంశీ కృష్ణ, ఎస్బిఐ రీజినల్ మేనేజర్, ఫణి శ్రీనివాసులు, ఎఫ్ ఎల్ సీ. కోట మధు సూదన్ తో పాటు వివిధ బ్యాంకుల ఉన్నత అధికారులు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

మన ఊరు మనబడి

కార్యక్రమంలో భాగంగా వీడియో కాన్ఫరెన్ లో సమీక్ష సమావేశం ను కలెక్టర్ నిర్వహించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీ మంద మకరంద జిల్లా అధికారులు డి ఇ ఓ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు