ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నది!

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి!

(J. Surender Kumar)

నిధుల మళ్లింపుతో కెసిఆర్ ప్రభుత్వం స్థానిక సంస్థలు నిర్వీర్యం చేస్తున్నద ని సర్పంచులు హక్కుల పరిరక్షణ పోరాటానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన సారంగాపూర్ లో గురువారం ఆయన పార్టీల సమావేశంలో మాట్లాడారు.
నిధుల విడుదలలో కేంద్రం జాప్యం చేస్తోందని రాష్ట్రం.. యుటిలిటీ సర్టిఫికేట్ సమర్పించ లేదనీ కేంద్రం ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, నిధుల విడుదల లో జాప్యంతో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నాయి.


దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల నిర్వహణకు, ఆర్థిక తోడ్పాటు అందించేందుకు జవహర్ రోజ్ గార్ యోజన, నెహ్రూ రోజ్ గార్ యోజన ద్వారా కేంద్రం నుండి స్థానిక సంస్థలకు నేరుగా నిధులు అందించారు.
గ్రామాల్లో నిరుపేదలకు ఉపాధి కల్పించాలని సోనియా గాంధీ నేతృత్వంలో ప్రధాని మన్మోహన్ సింగ్ పాలనలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంను రూపొందించారు.
గ్రామాల్లో జరిగే ఏ అభివృద్ధి పథకం అయిన జాతీయ ఉపాధి హామీ నిధులతోనే జరుగుతున్నాయి.
డంపింగ్ యార్డ్, వైకుంటదామం, కాంటూరు కందకాలు,మరుగు దొడ్ల నిర్మాణం, పశువుల కొట్టలు వంటి ప్రతి కార్యక్రమం ఉపాధి హామీ నిధులతోనే చేపడుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పై అపనమ్మకం తో కేంద్ర ప్రభుత్వ నిధులు కోసం ప్రత్యేకంగా ఖాతాలు తెరిస్తే, రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ కీ తో నిధులు మళ్లించింది.
నిధుల మళ్లింపును తీవ్రంగా ఖండిస్తున్నాం..
కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు మళ్లించి స్థానిక సంస్థలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను రాష్ట్ర ప్రభుత్వం అపహాస్యం చేసింది.
సర్పంచులు హక్కులు కాలరాసే లా, నిధులు కాజేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసిస్తూ, సర్పంచులు హక్కుల పరిరక్షణకు చేపట్టే ఏ పోరాటానికైనా కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది.
డిజిటల్ కీ తో నిధులు మళ్లించిన అధికారుల పై చర్యలు తీసుకోవాలి.
దారి మళ్లించి స్థానిక సంస్థల నిధులను పంచాయతీలకు వెంటనే జమ చేయాలి..
గ్రామ పంచాయతీలకు స్వేచ్ఛ నివ్వాలి గుంటూరు తదితర అంశాలపై జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు
.