ప్రమాదానికి గురి అయిన ప్రధాని సోదరుడి కారు!

స్వల్ప గాయాలతో క్షేమం!

( J. Surender Kumar)

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సోదరుడు .ప్రహ్లాద్ మోదీ, కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారు మంగళవారం మైసూర్ సమీపంలో ప్రమాదానికి గురి అయింది.  పోలీసులు  సమాచారం ప్రకారం, కారులో డ్రైవర్ , ప్రహ్లాద్, అతని కుమారుడు, కోడలు మరియు పసివాడు ఉన్నారు.. వీరికి స్వల్ప గాయాలయ్యాయని, చికిత్స నిమిత్తం జేఎస్‌ఎస్‌ ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.

ప్రధాని సోదరుడు ప్రహల్లాద మోడీ ( ఫైల్ ఫోటో)

పోలీసు వర్గాల కథనం మేరకు .మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో కడకోల సమీపంలో ఈ ఘటన జరిగింది.. బాందినీపూర్ వెళ్లే క్రమంలో వారి కారు  రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. మైసూరు పోలీసు సూపరింటెండెంట్ సీమా లత్కర్ సంఘటనా స్థలాన్ని, ఆసుపత్రిని, చెరుకు వివరాలు సేకరించి పిఎమ్ఓ కార్యాలయానికి నివేదిక పంపినట్టు వార్తా సంస్థకు పోలీస్ అధికారి వివరించారు.  ప్రహ్లాద్ మోడీ  ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు.

బాందినేపూర్