ప్రధాని నరేందర్ మోడీ తండ్రి మృతి  సందర్భంలోనూ.. ఇలానే చేశారు!

ఆయనకు పార్టీ పట్ల కమిట్మెంట్,!

J .Surender Kumar,

నరేంద్ర మోడీ తన తండ్రి అంత్యక్రియలు జరిగిన వెంటనే పార్టీ సమావేశానికి హాజరయ్యాడు, అని VHP నాయకుడు  ANI వార్తా సంస్థకు శనివారం తెలిపారు. తన తల్లి హీరాబెన్ అంత్యక్రియల తర్వాత శుక్రవారం ప్రధాని మోడీ పశ్చిమ బెంగాల్ ప్రాజెక్టులను ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు.

1989లో, నరేందర్ మోడీ తన తండ్రి మృతి చెందిన సందర్భంలోనూ. తన తల్లి హీరా బెన్ మృతి చెందిన సమయంలోను అంత్యక్రియల తర్వాత అదే రోజున అధికారిక కార్యక్రమాలలో, నాడు పార్టీ సమావేశాలలో పాల్గొన్నారు అని   విశ్వహిందూ పరిషత్ ప్రధాన కార్యదర్శి దిలీప్ త్రివేది,  మోడీ తండ్రి మరణాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పారు. “అహ్మదాబాద్‌లో ఒక ముఖ్యమైన సమావేశం ఉంది. నరేంద్రమోడీ తండ్రి మరణించారని మాకు సమాచారం అందింది.  ఆయన వారి నివాస గ్రామానికి వెళ్ళారు. మోడీ సమావేశానికి రాలేరని మేము అనుకున్నాము. కానీ నరేంద్ర మోడీ సమావేశానికి మధ్యాహ్నం వచ్చారు.  మేము తన తండ్రి మరణానంతరం సమావేశానికి రావడం చూసి ఆశ్చర్యపోయాను” అని త్రివేది వార్తా సంస్థ ANIతో అన్నారు.
నాడు మోదీతో మాట్లాడిన విషయాన్ని కూడా త్రివేది గుర్తు చేసుకున్నారు. . “సమావేశం ముగిసిన తర్వాత, మీ ఇంట విషాదకర పరిస్థితులలో మీరు సమావేశానికి హాజరుకావడం గురించి  మోడీని అడిగాను. అంత్యక్రియల తర్వాత సమావేశానికి బయలుదేరానని ఆయన బదులిచ్చారు. పార్టీ కోసం తన బాధ్యతలను కూడా నిర్వర్తించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.  ఇది స్ఫూర్తిదాయకమైన క్షణం, కార్యకర్తలు, నాటి నాయకులం మా బాధ్యతల పట్ల అంకితభావాన్ని మేము నేర్చుకున్నాము అని” అని త్రివేది అన్నారు.
ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ ఆసుపత్రిలో చేరిన రెండు రోజుల తర్వాత, ఆమె శుక్రవారం తెల్లవారుజామున మరణించారు. తన తల్లి మరణ వార్తను ట్వీట్ చేసిన తర్వాత ప్రధాని మోదీ అహ్మదాబాద్‌కు బయలుదేరారు. అంత్యక్రియలు చేసిన తర్వాత, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశ్చిమ బెంగాల్‌లో అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని పాల్గొన్నారు.