ప్రధాని నరేంద్ర మోదీ కి మాతృ వియోగం.!

హీరాబెన్‌(100)  కన్నుమూత!

( J. Surender Kumar)

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాతృమూర్తి   హీరాబెన్‌ (100)
శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందారు..

రెండు రోజుల క్రితం  ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని యు.ఎన్‌.మెహతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందతున్న హీరాబెన్‌ ఆరోగ్యం పరిస్థితి చూసుకోవడానికి ప్రధాని ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులను తల్లి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

వాతావరణం లో వైద్యులు ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్ బుల్లెట్ అని కూడా విడుదల చేశారు.

శుక్రవారం తెల్లవారుజామున ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు ఆమె వందో పుట్టినరోజు వేడుకలు జరిగాయి..

గుజరాత్ పోలింగ్ సందర్భంలో గుజరాత్ కి వెళ్ళిన మోడీ తన తల్లితో కొంతసేపు గడిపారు.
తల్లి శవాన్ని మోసిన ప్రధాని!


తల్లి హీరా బెన్ మృతిపై మోడీ భాగొద్వేగ ట్వీట్..
‘నా తల్లి ఈశ్వరుని పాదాల చెంతకు చేరింది.,
నా తల్లిని చూస్తే త్రిమూర్తులను చూసినట్లు వుండేది.,
మంచి బుద్ధితో పని చేస్తూ స్వచ్ఛమైన జీవితాన్ని గడుపు.,
హీరా బెన్ మోదీ తో చివరి మాటలు. అంటు పేర్కొన్నారు.