ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలి!

జిల్లా కలెక్టర్ జి.రవి

(J. Surender Kumar)

ప్రజావాణిలో ప్రజల నుండి స్వీకరించిన అర్జీలు, దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ జి.రవి జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అదనపు కలెక్టర్లు మందా మకరంద్, బిఎస్ లత తో కలిసి హాజరై ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. పెండింగ్ లో ఉన్న అర్జీలపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అన్నారు. రెవెన్యూ, భూ సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపాలని ఆదేశించారు.
కాగా ఈరోజు ప్రజావాణికి మొత్తం 24 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పర్యవేక్షకులు, తదితరులు పాల్గొన్నారు.