ప్రత్యేక ఓటర్ సవరణ జాబితా -2023
రూపకల్పన పారదర్శకంగా చేపట్టాలి

ఢిల్లీ నుండి డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ !

(J.Surender Kumar)

శుక్రవారం ఢిల్లీ నుండి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ కుమార్ వ్యాస్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో, జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో జగిత్యాల జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ జి. రవి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.

సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం
సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ కుమార్ వ్యాస్ జిల్లాలో ఓటరు నమోదు, ఫారం 6,7, 8 ల క్రింద వచ్చిన దరఖాస్తులు, దిస్పోజల్, పెండింగ్ , అందుకుగల కారణాలు తదితర అంశాల పై జిల్లాల వారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ కుమార్ వ్యాస్

మాట్లాడుతూ, ప్రత్యేక ఓటర్ సవరణ జాబితా -2023 రూపకల్పనలో భాగంగా అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఓటర్ నమోదు కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలన చేసి అర్హులకు ఓటు హక్కు కల్పించాలని, విద్యాసంస్థల్లో విద్యార్థులు అందరూ తమ పేరును నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, చేర్పులు, మార్పులు చేసి తుది ఓటర్ జాబితా పకడ్బందీగా తయారు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలంగాణలో ప్రత్యేక ఓటర్ సవరణ జాబితా -2023 కార్యక్రమ ప్రగతిని కేంద్ర ఎన్నికల సంఘం
సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ కుమార్ వ్యాస్ కు వివరించారు.

2022 నవంబర్ 9 నుండి 30 నవంబర్ వరకు
రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష 49 వేల 975 ఫారం -6 దరఖాస్తులు రాగా, 19 వేల 298 దరఖాస్తులు పరిష్కరించడం జరిగిందని, అలాగే ఫారం -7 దరఖాస్తులు 43 వేల 839 స్వీకరించి, 9 వేల 605 డిస్పోజ్ చేయడం జరిగిందని, ఫారం -8 దరఖాస్తులు 38 వేల 762 దరఖాస్తులు స్వీకరించి 7 వేల 782 దరఖాస్తులు డిస్పోజ్ చేయడం జరిగిందని, మిగతా పెండింగ్ దరఖాస్తులు వివిధ దశలలో ఉన్నాయని తెలిపారు. 2 కోట్ల 95 లక్షల 85 వేల నాలుగు ఓటర్ లకు గాను ఒక కోటి 67 లక్షల 91 వేల 349 మంది 6బి ఫారం ఇచ్చి ఆధార్ లింక్ చేసుకోవడం జరిగిందని, 56.76 శాతం ఆధార్ లింక్ దరఖాస్తులలో 42.69 శాతం ఆన్లైన్ ద్వారా, 14.07 ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయిలలో ఓటర్ నమోదు అవగాహన, ప్రచార కార్యక్రమాలు చేపట్టడంతో పాటు పోలింగ్ బూత్ స్థాయిలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు.


అర్హతగల ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా చూడాలి కలెక్టర్
వీడియో సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ జి. రవి సంబంధిత అధికారులతో మాట్లాడుతూ,
చనిపోయిన వారి వివరాలను తీసుకొని జాబితా నుండి తొలగించాలని, కొత్తగా ఓటర్ నమోదుకు, సవరణలకు గాను ప్రజల అవగాహన కొరకు జిల్లాలో అవగాహన చైతన్య కార్యక్రమాలు చేపట్టి రానున్న రెండు రోజుల్లో ఎక్కువగా మంది నమోదు చేసుకునేలా చూడాలన్నారు. ఆఫ్ లైన్ లో వచ్చిన దరఖాస్తులను డిజిటలైజేషన్ చేయాలని, ఎప్పటికప్పుడు వచ్చిన దరఖాస్తులను పరిశీలన చేసి చేర్పులు, మార్పులు చేయాలని, ఇంటింటికీ వెళ్లి నమోదు చేయాలనీ, రాజకీయ పార్టీ ప్రతినిధులు, ఇతరుల అభ్యంతరాలను పరిశీలన చేసి తుది జాబితా పకడ్బందీగా తయారు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ వీడియో సమావేశంలో ఎన్నికల ఎలక్షన్ సిబ్బంది సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.