ప్రత్యేక శాఖగా వికలాంగుల సంక్షేమ శాఖ!

మంత్రి కొప్పుల ఈశ్వర్ !

(J. Surender Kumar)

దివ్యాంగుల సంక్షేమ శాఖ, ప్రత్యేక శాఖగా కొనసాగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు
శనివారం నాడు ప్రపంచ వికలాంగుల దినోత్సవ సందర్భంగా రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ

రాష్ట్ర సంక్షేమలో 8 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి ఈ దేశానికి ఆదర్శంగా ,రాష్ట్రాన్ని పురోగమనలోకి తీసుకు వెళుతున్నారని కితాబు ఇచ్చారు.

భవిష్యత్తులో మరిన్ని ప్రణాళికలతో వికలాంగుల సంక్షేమ శాఖను ముందుకు తీసుకువెళ్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో దివ్యాంగులకు అమలు చేస్తున్న పథకాలు ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదని అన్నారు.

గతంలో అతి తక్కువ బడ్జెట్ ఉన్న వికలాంగుల బడ్జెట్ ను ₹56 కోట్లతో నిర్వహించడం జరుగుతుందని గతంలో ₹20 కోట్ల రూపాయలతో పరికరాలు అందజేయడం జరిగిందని మంత్రి తెలిపారు. జిల్లాలు నియోజక వర్గాలలో క్యాంపులను నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక జరుపుతున్నామని ఒక లక్ష 25 వేలు మంది లబ్ధిదారులకు ఇప్పటికే అనేక పథకాలు అందజేయడం జరిగిందని ఐదు శాతం రిజర్వేషన్ డబల్ బెడ్రూంలో, వికలాంగులకు అందించేందుకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.


2016 నుండి నేటి వరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖలో కలిసి ఉన్న వికలాంగుల సంక్షేమ శాఖను, మాతృ సంస్థలోకి మారుస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వేదికపై పిడబ్ల్యుడి హెల్ప్ లైన్ ఒకటి ఐదు ఐదు మూడు రెండు ఆరు తో పాటు చేయూత వాహనాలు 10 వాహనాలను, 33 జిల్లాలకు అందజేయడం జరుగుతుందని, ఒక కోటి రెండు లక్షల రూపాయలతో నిర్మాణ సహకారంతో పిడబ్ల్యుడి వికలాంగులకు ఉపాధి కోసం ఎంప్లాయ్ మెంట్ ఎక్స్చేంజిను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్బంగా పలువురు దివ్యంగులను మంత్రి కొప్పుల ఈశ్వర్ సన్మానం చేశారు.


ఈ కార్యక్రమంలో దివ్య దేవరాజన్, డైరెక్టర్ శైలజ వికలాంగుల సంక్షేమ శాఖ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.