ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్!
( J. Surender Kumar)
రాయికల్ మండల ఆలూరు గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ అతడి అనుచరులు 20మంది బిజెపి, కాంగ్రెస్ పార్టీల నుండి ఆదివారం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు . వారికి పార్టీ కండాల కప్పు సాదరంగా ఎమ్మెల్యే ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం పచ్చదనం తో,పరిశుభ్రత లో పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందుతుంది
ప్రతిపక్ష నేత జీవన్ రెడ్డి అధికారం లోకి వస్తే 2500 పెన్షన్ ఇస్తామనడం హాస్యాస్పదం గా ఉందనీ అన్నారు.
గతంలో 200 కూడా సరిగా ఇవ్వలేని కాంగ్రెస్… ఇప్పుడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా 1000 పెన్షన్ లేదని అన్నారు…
ప్రతి గ్రామంలో హరిత హరం, వైకుంఠ దామం,కంపోస్టు షెడ్డు,పల్లే ప్రకృతి వనం, గ్రామ పంచాయతీ లకు వచ్చే నిధుల్లో 10 నెలల లుగా కేంద్ర బీజేపీ సర్కార్ కోత విధిస్తున్నారు అని అన్నారు..
కేంద్రం బీజేపీ ప్రభుత్వం రైతులు పండించే బియ్యం ఎగుమతి పై 20శాతం సేస్సు,,నూకల ఎగుమతి నిషేదం వల్ల రైతులకు తీవ్ర నష్టం…
రాష్ట్రంలో అన్ని కుల వృత్తుల,కుల సంఘల అభివృద్ధికి పెద్ద పీట..అన్ని మతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్నారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో PACS ఛైర్మెన్ రాజీ రెడ్డి, సర్పంచ భాగ్యలక్ష్మి,ఎంపీటీసీ సురేందర్ రెడ్డి,మాజీ.ఎంపీటీసీ రాజన్న, PACS డైరెక్టర్ మల్లారెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
క్రిస్మస్ వేడుకల్లో ..

పట్టణంలోని గోవింద్ పల్లి ఏసురక్తం గార్డెన్స్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీ మణులకు శుభాకాంక్షలు తెలిపారు.

పుట్టినరోజు వేడుకలలో..

కోరుట్ల పట్టణంలో డాక్టర్ అనుప్ రావు మనుమడు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసిన నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.తో పాటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మరియు ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.