రాష్ట్రపతి పర్యటన సందర్భంగా పందులు కాల్చివేత!

ప్రొఫెషనల్ షూటర్ల తో 185 పందులు !

విశాఖ కార్పొరేషన్ లో..

(J. Surender Kumar)

విచ్చలవిడిగా సంచరిస్తున్న పందుల వల్ల రోగాలు వ్యాపించి ట్రాఫిక్‌కు, అంతరాయం కలుగుతున్నందున వాటిని ప్రత్యేక డ్రైవ్‌లో కాల్చి చంపుతున్నట్టు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌  రాజబాబు వివరించారు.
నేవీ డే వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖపట్నం వచ్చిన సందర్భంగా పందుల ఏరివేతకు శనివారం చర్యలకు శ్రీకారం చుట్టారు.

విశాఖపట్నం నగర పరిధిలోని 185 విచ్చలవిడి సంచరిస్తున్న పందులను గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి) పబ్లిక్ హెల్త్ అధికారులు, ప్రొఫెషనల్ షూటర్ల సహాయంతో కాల్చి చంపారు.
నగరంలో దాదాపు 5 వేల పందులు ఉన్నాయి. వాటిని నగరం నుంచి తీసుకెళ్లాలని యజమానులను కోరినట్టు అధికారులు వివరించారు.  మెజారిటీ యజమానులు దాదాపు 1000( వెయ్యి) పందులను స్వయంగా తీసుకువెళ్లారని  మిగిలిన వారు పట్టించుకోలేదన్నారు
కొందరు యజమానులు మొండిగా ఉండడంతో, మేము 185 పందులను కాల్చి చంపడంలో ప్రొఫెషనల్ కిల్లర్స్ సహాయం తీసుకున్నాము. ప్రక్రియ కొనసాగుతుంది” అని కమిషనర్  తెలిపారు.
పందులను కాల్చిచంపడాన్ని పలు రాజకీయ పార్టీ నాయకులు  ఖండించారు.  జివిఎంసి పందుల కోసం షెల్టర్‌ను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.