2 కోట్ల 43 లక్షల మంది రైతులకు.
అందని పీఎం కిసాన్ యోజన డబ్బులు!

సంప్రదించవలసిన నంబర్ లు!
హెల్ప్ లైన్; 011-24300606.
టోల్ ఫ్రీ: 18001801551,
కాల్ నెంబర్: 255261.
ట్విట్ చేసిన కేంద్ర వ్యవసాయ మంత్రి!

(J. Surender Kumar)

ప్రధానమంత్రి కిసాన్ పథకానికి సంబంధించిన 12వ విడత సొమ్ము.  2,43,03,867 మంది రైతులకు  అందలేదు, డబ్బులు వస్తాయో ?  లేదో  ? తెలుసుకోవడానికి ఈ నంబర్‌కు కాల్ చేయండి. రైతులు ప్రధాన మంత్రి కిసాన్‌కు సంబంధించిన ఏదైనా సమస్యను పరిష్కరించడానికి టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు. రైతులు తమ పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా చూసుకోవచ్చు.  ఫిర్యాదులను pmkisan-ict@gov.in ఇమెయిల్ ద్వారా, కూడా సంప్రదించవచ్చు, లేదా హెల్ప్‌లైన్ 011-24300606కు కాల్ చేయవచ్చు, అని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌లో తెలిపింది.

ప్రధానమంత్రి కిసాన్ 12వ విడతను
17 అక్టోబర్ 2022న ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. 12వ విడతలో 8,84,56,693 మంది రైతుల ఖాతాల్లో ₹ 200/-  జమ కాగా, 2,43,03,867 మంది రైతులకు ఖాతాలలో జమ కాలేదు.
ఈ పథకంలో 11వ విడతలో
11,27,60,560 మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం గమనార్హం. నగదు రహిత రైతులు పిఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. (పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన)  లబ్ధిదారుల కోసం కేంద్ర ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్‌ను విడుదల చేసింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నీతి యోజనకు సంబంధించిన ఏవైనా సమస్యల కోసం రైతులు టోల్ ఫ్రీ నంబర్లు – 1800 180 1551 లేదా 155261కు కాల్ చేయవచ్చని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌లో తెలిపింది.
e-KYC అవసరం
 PM కిసాన్ పథకంలో  నమోదు చేసుకున్న రైతులకు eKYC తప్పనిసరి . OTP ఆధారిత eKYC PM కిసాన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది.. లేదా బయోమెట్రిక్ ఆధారిత eKYC కోసం సమీపంలోని CSC కేంద్రాలను రైతులు సంప్రదించవచ్చు వ్యవసాయ మంత్రి  ట్విట్ లో పేర్కొన్నారు.