శబరిమలకు పోటెత్తిన భక్తులు!
క్యూ లైన్ లో లక్షమంది అయ్యప్పలు!

(J. Surender Kumar)

కేరళ శబరిమలలోని అయ్యప్పస్వామి దర్శనానికి అయ్యప్ప.భక్తులు పోటెత్తారు. శనివారం లక్ష మంది భక్తులు స్వామిని దర్శించుకోగా, మూడు లక్ష మంది. అయ్యప్ప భక్తులు స్వామివారి దర్శనం కోసం దాదాపు లక్షకు పైగా పంబ నుండి సన్నిధానం వరకు క్యూ లైన్ లో వేచి ఉన్నారు.

వీఐపీల ఉత్తరాలు, మంత్రులు సిఫారసు లేఖలను. పరిగణంలోకి తీసుకోకుండా సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కేరళ హైకోర్టు ట్రావెన్కోర్ దేవస్థానం కు ఆదేశాలు జారీ చేయడంతో. వీఐపీల సిఫారసు లేఖలు ఉపయోగపడడం లేదు. పంబ గణపతి ఆలయం నుంచి. శబరిమల కొండకు సన్నిధానం వరకు వెళ్లేందుకు దాదాపు 10 గంటల సమయం పడుతోంది. అయ్యప్ప స్వాములు వివరిస్తున్నారు.

ఎమ్మెల్యే సంజయ్ ని అభినందించిన మిత్రులు!

జగిత్యాల ఎమ్మెల్యేగా నాలుగు సంవత్సరాల పదవీ కాలాన్ని విజయవంతంగా మూసిన సందర్భంలో ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ను ఆదివారం సన్మానించి అభినందించారు. ఎమ్మెల్యే అభిమానులు, టిఆర్ఎస్ శ్రేణులు, కౌన్సిలర్ కప్పల శ్రీకాంత్, డాక్టర్ రాచకొండ శ్రీనివాస్, గుడికందుల మహేష్, సామ సునీల్, ఎన్నకుల శ్రీకాంత్, కోటగిరి వేణు మాధవ్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఒడ్డేర సంఘం అధ్యక్షుడి జన్మదిన వేడుకలు!

రాష్ట్ర ఓడ్డేర సంఘం అధ్యక్షులు, 7 వ వార్డ్ భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు వల్లేపు మొగిలి జన్మదినం సందర్భంగా. ఆయన అనుచరగానం మిత్ర బృందం ఘనంగా వేడుకలు నిర్వహించారు. యువకులు,మొగిలి ని కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్సీ కవిత, ఎమ్మేల్యే సంజయ్ కుమార్ ల సహకారంతో నిధులు మంజూరు చేయించి 7వార్డ్ అభివృద్ధికి కృషి చేస్తా అన్నారు.