సమాజ ఆరోగ్యం పట్ల సామాన్యుడి ఆవేదన ! స్పందించిన యంత్రాంగం..

జగిత్యాలకు హుటాహుటిన తరలివచ్చి
తనిఖీలు చేపట్టిన
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యంత్రాంగం..

(J. Surender Kumar)

జిల్లా కేంద్రం లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో బయో మెడికల్  వేస్టేజిపై  నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుపై పలు షోషల్ మీడియాలో, వార్త పత్రికలలో,అధికారులకు పోస్ట్ చేసి నివేదించగా బయో మెడికల్ వేస్టేజిని ఇష్టానుసారంగా పారవేస్తున్న మాత శిశువు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారుల (రామగుండం) శుక్రవారం రాత్రి ఆకస్మిక తనిఖీలు చేసి నివేదిక సిద్ధం చేశారు

వివరాల్లోకి వెళితే

జగిత్యాల్ పట్టణం కు చెందిన భాస ప్రకాష్, అనే  సామాన్య పౌరుడు, ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద నిర్లక్ష్యంగా వేస్తున్న బయో మెడికల్ వేస్టేజ్ పై సోషల్ మీడియాలో, పాత్రికేయులకు, వాటి వల్ల జరిగే అని అరిష్టం, సమాజం లో విస్తరించనున్న  రోగాలు, అంటువ్యాధులు, అనారోగ్య స్థితిగతులను వివరిస్తూ. ప్రచార సాధనాల్లో పోస్టు పెట్టాడు.


దీంతో స్పందించిన సెంట్రల్ పొల్యూషన్ బోర్డ్ యంత్రాంగం రామగుండంలో లోని వారి శాఖ యంత్రాంగాన్ని విచారణకు ఆదేశించారు. దీంతో ఒకటో అధికారులు రాత్రి జగిత్యాలకు  చేరుకొని పోస్ట్ పెట్టిన భాస ప్రకాష్ ను కలిసి వివరాలు సేకరించారు.

ప్రకాష్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్  ఉన్నది. ఉన్నట్టు.గా...

జగిత్యాల మాత శిశువు ఆరోగ్య కేంద్రంలో బయో మెడికల్ వేస్ట్ స్టోర్ గది లేకపోవడంతో హాస్పిటల్ పరిసరాల్లో ఓపెన్ ప్లేసులో వేస్తున్న సిబ్బంది..
మాత శిశువు ఆరోగ్య కేంద్రం దుర్గంధమయం.
బయో మెడికల్ వేస్ట్ ను తిన్న పందులు జనాల్లోకి ప్రవేశిస్తే వాటి వల్ల ప్రజల ఆరోగ్యాలకి ఎంత నష్టం.
బయో మెడికల్ వేస్ట్ నిర్వహనపై ఎన్ని సార్లు పలు మీడియా,పత్రికలలో వచ్చినా, నేను ప్రజావాణి లో ఫిర్యాదు చేసిన స్పందన కరువైంది.
నూతనంగా ప్రారంభించే ఆసుపత్రులకు బయో మెడీకల్ వేస్ట్ మేనేజ్మెంట్ పై WHO,NGT,CPCB కఠినమైన మార్గదర్శకాలు ఉన్నాయి..వీటిని తుంగలో తొక్కుతున్నారు…

మాత శిశువు ఆరోగ్య కేంద్రానికి రోజుకు వందల సంఖ్యలో గర్భిణులు వస్తుంటారు. రోజుకు ఎంతో మంది గర్భిణులు డెలివరీ అవుతారు..
ఆసుపత్రిలో ఉత్పత్తి అయ్యే ప్లాసెంట మరియు కణజాల వ్యర్థాలను నిర్దేశించిన పద్దతిలో పారవేయకపోతే,అపరిశుభ్ర పరిస్థితులకు దారితీయడమే కాకుండా,అంటువ్యాధులు మరియు విష రసాయానాలతో పర్యావరణ కాలుష్యం కారణంగా బాలింతలు,పసిపిల్లలు,
సిబ్బంది,వైద్యులు మరియు ప్రజలకు ఆరోగ్య ప్రమాదం ఏర్పడుతుంది,
ఇప్పటికే జగిత్యాల మాత శిశువు ఆరోగ్య కేంద్రంలో ఇన్ఫెక్షన్లు సోకి బాలింతలు మృతి చెందారని పలు వార్త  పత్రికలలో కథనాలు కూడా వచ్చాయి.
మాత శిశువు కేంద్రంలో బయో మెడికల్ వేస్ట్ నిర్వహణ చూస్తే మనమే సిగ్గుపడాలి.
మాత శిశువు ఆరోగ్య కేంద్రం ఇలా ఉంటే నేనేమి తక్కువ కాదని జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో బయో మెడికల్ వేస్ట్ స్టోర్ గది ఉన్నా బహిరంగంగానే ఆసుపత్రి ఆవరణలో బయో మెడికల్ వేస్ట్ ను పారవేస్తున్నారు.
ప్రజల ఆరోగ్యాలకు హామీ ఇవ్వవలసిన అధికారులకు,పాలకులకు ఇంత నిర్లక్ష్యం తగదు..
జగిత్యాల,మెటపల్లి,కొరుట్ల రాయికల్,మున్సిపాలిటీ డంప్ యార్డులను చూస్తే  అక్కడ ఎంత బయో మెడికల్ వేస్ట్ ఉందొ చూడండి.
త్వరలోనే నేను అన్ని ఆధారాలతో జగిత్యాల జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై,ప్రభుత్వ హాస్పిటల్స్ పై (CPCB)సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్,(NGT) నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను మీకు పెద్దఎత్తున ఫెనాల్టీ వేయాలని కోరుతాను

ఈ ఫొటోలు,వీడియోలు చూస్తే మీకే అర్థం అవుతుంది.
శ్రయుత గౌరవనీయులైన జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి విన్నపం…
సార్.. మీరైన బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ పై ప్రత్యేక చొరవ చూపాలని కోరుతూ…
బాస ప్రకాష్ షోషల్ వర్కర్
జగిత్యాల.9618635682