ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్!
(J. Surender Kumar)
నూతనంగా ఎన్నికైన సంఘ సభ్యులు అధ్యక్ష కార్యదర్శులు, శ్రేయస్సు తో పాటు సమాజ అభివృద్ధికి కృషి చేయాలని, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

గురువారం జగిత్యాల్ పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపం లో వెలమ సంక్షేమ మండలి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం లో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు శుభా కాంక్షలు తెలిపి వారిని సన్మానించారు. వెలమ సంక్షేమండలి ప్రధాన కార్యదర్శిగా బోయినిపెల్లి ఆనంద్ రావు నాలుగు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు 2022 -2024 నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎమ్మెల్యే కార్యవర్గ సభ్యులు ఆ నలుగురు ఘనంగా సన్మానించారు.