జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్!
(J.Surender Kumar)
ధర్మపురి నియోజవర్గ స్థాయి క్రిస్మస్ వేడుక లు రాజారాం పల్లె ఫంక్షన్ హాల్ లో శుక్రవారం ఘనంగా జరిగాయి.. ముఖ్యఅతిథిగా జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ కలెక్టర్ రవి నాయక్ పాల్గొన్నారు..అనంతరం కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ…..
తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాలకు సీఎం కేసీఆర్ సమన్యాయం చేస్తున్నారని ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తూన్నారని అన్నారు.
సహనం, శాంతి, దయ వంటి ప్రేమ మార్గాలను చూపిన క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శమన్నారు. ఆయన చూపిన బాటలో తోటివారిపట్ల ప్రేమతో జీవించాలని సూచించారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో
రెండు లక్షల మంది పేద క్రైస్తవులకు బట్టలు
పంపిణీ చేస్తున్నారు అని అన్నారు.

అందరూ సంతోషంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి జెడ్పీటీసీ సభ్యులు సుధారాణి, అరుణ, ఎంపీపీలు శోబా రాణి, చిట్టి బాబు, మాజీ AMC ఛైర్మెన్ కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్షులు జగన్ రాజారాం పల్లే సర్పంచ్ శేకర్ క్రిస్మస్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ సుధాకర్ DWO డా. నరేశ్ నియోజకవర్గ పాస్టర్లు క్రైస్తవ సోదరులు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు