సత్యవ్వకు మహిళ సాధికారత-ఎక్సలెన్సీ అవార్డు!

జగిత్యాల మహిళ సంఘ సభ్యురాలు

(J. SURENDER KUMAR)

హైదరాబాద్  లోని నోవాటేల్ హోటల్ లో సుప్రీం కోర్టు న్యాయమూర్తి శ్రీమతి హిమకోహ్లీ, శనివారం  జగిత్యాల రూరల్ మాండలం లక్ష్మిపూర్ గ్రామనికి చెందిన మహిళ స్వశక్తి సంఘ సభ్యురాలు మారు.సత్తవ్వ కి MIAMC-గ్రూప్ ఆఫ్ మేడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మహిళ సాధికారిక-ఎక్సలెన్సీ అవార్డు ను ప్రధానం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రంగాల్లో మహిళ సాధికారత కు కృషి చేసిన 9 మంది మహిళలకు ఈ అవార్డులను ప్రధానం చేశారు.
ఇందులో సెర్ప్ మహిళల సంఘ సభ్యులకు సంబంధించి 3 అవార్డులు వరంగల్, ఖమ్మం, జగిత్యాల జిల్లాల మహిళ సంఘాల సభ్యులకు ప్రధానం చేయడం జరిగినది., వివిధ హోదాలో ఉన్న మహిళ ప్రముఖులు ఇట్టి కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది.
అవార్డు అందుకున్న సందర్భంగా జిల్లా డి.ఆర్.డి.ఓ. ఎస్.వినోద్, అదనపు పి.డి. .సుదీర్,జిల్లా .డీపీఎం లు,ఎపియం లు,సెర్ప్ సిబ్బంది తో పాటు మండల ఎపియం వి.గంగాధర్, మండల సమాఖ్య సభ్యులు,సిబ్బంది అభినందనలు తెలిపారు.