ఎస్సీ ఎస్టీ కేస్ లలో విచారణ వేగవంతం చేయాలి !

జగిత్యాల ఎస్పీ సింధు శర్మ !

(J.Surender Kumar)

ఎస్సీ ఎస్టీ , కేస్ లలో విచారణ వేగవంతం చేయాలనీ , ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి అని జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ ఆదేశించారు.


శుక్రవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో డీఎస్పీలు, సి.ఐ లు ఎస్.ఐల తో పెండింగ్ కేసులు, గ్రేవ్ కేసులు , SC/ST కేస్ లపై పురోగతి పై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ లో ఉన్న కేసులలో త్వరగా పరిశోధన పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయాలి అని పెండింగ్ కేసులలో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎస్ఓపి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి, కేసులు ఛేదించాలని సూచించారు. పెండింగ్లో ఉన్న సీసీ నెంబర్ల గురించి తరచుగా మెజిస్ట్రేట్ లను, మరియు కోర్టు అధికారులను కలిసి, ప్రతిరోజూ మానిటర్ చేసి, సీసీ నెంబరులు తీసుకోవాలని సూచించారు. SC/ST కేస్ లపై ప్రత్యేక దృష్టి సారించాలని, పోక్సో యాక్ట్ కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రౌడీ, హిస్టరీ షీట్స్ ఉన్నవారిపై నిరంతరం నిఘా, పర్యవేక్షణ ఉంచాలని , ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించి హిస్టరీ షీట్స్ ఓపెన్ చేయాలనీ అధికారులను ఆదేశించారు.

ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్టు జారి చేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితులపై, లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుపరచడానికి అధికారులు, సిబ్బంది అందరూ కృషి చేయాలని సూచించారు. నాన్ బెయిలబుల్ వారెంట్లను త్వరగా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల కేసు విచారణ విజయవంతంగా పూర్తి అయి సకాలంలో బాధితులకు న్యాయం జరుగుటకు ఆస్కారం వుంటుంది అన్నారు.. రాష్ట పోలీసు శాఖ చేపట్టిన 17 ఫంక్షనల్ వర్టికల్స్ పటిష్ట అమలు పరుస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. సిసిటిఎన్ఎస్ లో నూతనంగా లాంచ్ చేసిన 2.0 అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేయడం జరిగిందని, మరియు కేసుకు సంబంధించిన వివరాలు ఏ రోజుకు ఆ రోజు సిసిటిఎన్ఎస్ లో నమోదు చేయాలని సూచించారు. వర్టికల్ వారిగా విధులు నిర్వహించే అధికారులు సిబ్బంది వారు చేసే విధులు సిసిటిఎన్ఎస్ లో అప్లోడ్ చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో డీఎస్పీ ప్రకాష్, SB ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, మరియు సి.ఐ లు కిషోర్, కృష్ణకుమార్ , రమణమూర్తి, లక్ష్మీనారాయణ, కోటేశ్వర్, DCRB, ఐటీ కోర్,CCS ఇన్స్పెక్టర్ లు మల్లయ్య, సరిలాల్, నాగేశ్వరరావు DCRB, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.