28 రోజులలోనే..
రోజుకు ₹ 5 కోట్ల కు. పైన..
(J. Surender Kumar)
కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి కేవలం 28 రోజుల్లోనే వివిధ మార్గాల ద్వారా ₹148 కోట్లు ఆదాయం లభించింది. ఈ లెక్కన ప్రతిరోజు స్వామివారి ₹ 5. కోట్ల కు పైగా ఆదాయం వచ్చినట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. గత ఏడాది మొత్తం సీజన్‌లో .₹ 151 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2023.జనవరి 21న ఆలయం మూసివేస్తారు . ఆదాయం మరో రెండింతలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు ట్రావెన్కోర్ దేవస్థానం వర్గాలు అంచనా వేస్తున్నాయి. గత వారం రోజులుగా ప్రతిరోజూ దాదాపు లక్ష మంది అయ్యప్ప స్వాములు. తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

గత వారం నుంచి క్రమంగా రద్దీ పెరగడంతో క్రౌడ్ మేనేజ్‌మెంట్ చర్యలు చేపట్టడంలో పోలీసులు దేవస్థానం బోర్డు సభ్యులు విఫలమయ్యారని ఆరోప ణలు వినిపిస్తున్నాయి. స్వామి వారి దర్శనం కోసం అయ్యప్ప స్వాములు తలపై ఇరుముళ్ళు పెట్టుకొని కనీసం గా 10 గంటల పాటు క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. నిలక్కల్ వాహనాల పార్కింగ్ గ్రౌండ్ , నుండి 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. భక్తులు ఆహారం, నీరు లేకుండా అటవీ ప్రాంతంపై గంటల తరబడి తమ వాహనాల్లో వేచి ఉండాల్సి దుస్థితి నెలకొంది. మరకూట్టం నుండి సన్నిధానం వరకు క్యూలో వేచి ఉన్న భక్తులకు మరియు ఎలవుంకల్ నుండి అటవీ మార్గంలో వాహనాల్లో వేచి ఉన్న భక్తులకు తాగునీరు బిస్కెట్లు పంపిణీ చేయడానికి బోర్డు వాలంటీర్లను నియమించినట్టు బోర్డు చైర్మన్ చెప్పారు.

పక్కా ప్రణాళికతో క్రౌడ్ మేనేజ్‌మెంట్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు గురువారం పంపా వద్ద కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో చర్చించినట్టు దేవస్వామ్ మంత్రి కె రాధాకృష్ణన్ టిఎన్‌ఐఈ వార్తా సంస్థకు తెలిపారు
తొక్కిసలాట నివారించడమే లక్ష్యం:
నిమిషానికి 65 మంది యాత్రికులు పవిత్ర మెట్లను( పదినిమిట్టాంబడి) ఎక్కుతారని TDB ప్రెసిడెంట్ చెప్పారు. “పవిత్ర మెట్లు, మరియు సన్నిధానం వద్ద క్రౌడ్ మేనేజ్‌మెంట్ కోసం అనుభవజ్ఞులైన పోలీసు అధికారులను, సిబ్బందిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని దేవస్థానం బోర్డు చైర్మన్ విజ్ఞప్తి చేశారు. వర్చువల్ క్యూ బుకింగ్‌ను రోజుకు 90,000కి పరిమితం చేసాము. మరియు ఇకపై పూజా సమయంలో యాత్రికులను ఆపడం లేదు, ”అని వివరించారు. పిల్లలు, వికలాంగులు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్న యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకుంటామని రాధాకృష్ణన్ చెప్పారు. తొక్కిసలాట వంటి పరిస్థితిని నివారించడానికి మేము అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా, దర్శన స్లాట్‌ను బుక్ చేసుకున్న యాత్రికులతో పాటు, స్పాట్ బుకింగ్ ఇతర మార్గాల ద్వారా వేలాదిమంది10,000 మంది భక్తులు శబరిమలై వస్తున్నారని మంత్రి వివరించు

పార్కింగ్ లో. అధిక వాహనాలు!
నిలక్కల్ పార్క్ వద్ద కేవలం 7000 వాహనాలు మాత్రమే పార్క్ చేయడానికి స్థలం ఉందని,రోజుకు సుమారు 14వేల వాహనాలు వస్తున్నాయని తెలిపారు. కోవిడ్ ముందు ఎక్కువ మంది యాత్రికులు బస్సులలో వచ్చేవారు. ఇప్పుడు చాలా మంది కార్లలో వస్తున్నారు. మరిన్ని వాహనాల పార్కింగ్ కోసం విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు.
అయ్యప్ప స్వామి ఆదాయ వివరాలు !
2017-18 సంవత్సరంలో ₹ 277.96 కోట్ల ఆదాయం
2018-19 సంవత్సరంలో ₹ 179.22 కోట్లు
2019-20 సంవత్సరంలో ₹ 269.37 కోట్లు
2020-21 సంవత్సరంలో ₹ 21.17 కోట్లు
2021-22 ఆర్థిక సంవత్సరంలో ₹ 151 కోట్లు
2022 నవంబర్ 17 నుండి డిసెంబర్ 14 వరకు ₹148 కోట్లాది అయ్యప్ప స్వామికి వచ్చినట్టు దేవస్థానం అధికారులు వివరించారు.