ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో.
.
నెలరోజులపాటు ఉదయత్ పూర్వం పూజలు!
(J. Surender Kumar)
ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో శుక్రవారం తెల్లవారుజాము నుంచి ధనుర్మాస పూజాది కార్యక్రమాలు ఆరంభం కానున్నాయి.
ఈనెల 16 నుంచి 2023 జనవరి 14 వరకు ఈ పూజలు జరగనున్నాయి. ఉదయం 3 గంటలకు, అర్చక స్వాములు మంగళ వాయిద్యాలతో, గోదావరి నది పవిత్ర జలాలను తెచ్చి స్వామివారికి అభిషేకం, పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 4 గంటల నుండి.5-30 వరకు పూజలు, అర్చనాధి కార్యక్రమాలు జరుగుతాయి.
అర్చక స్వాములు, తిరుప్పావై ,ప్రబంధములు ప్రవచనం చేస్తారు. స్వామివారికి పొంగల్ నైవేద్యం సమర్పిస్తారు. పగలు 2- 30 నిమిషాల నుంచి 4-00 గంటల వరకు ఆలయం మూసి ఉంచుతారు.
లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా
నూతన సంవత్సరం జనవరి 2న ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు, జనవరి 13న గోదా కళ్యాణం జరగనున్నాయి.
ధనుర్మాసంలో స్వామివారి ఆలయం భక్తజనంతో కిక్కిరిసిపోతుంది.