శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు !

సోమవారం రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా
నంద్యాల జిల్లా ఎస్పి రఘువీర్ రెడ్డి !

( J.Surender Kumar)

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు శ్రీశైలంలో పర్యటించనున్నారు. శ్రీశైలం వచ్చే భక్తులు, శ్రైశలంలోని ప్రజలు పోలీసు వారికి సహకరించాలని .నంద్యాల జిల్లా ఎస్పి రఘువీర్ రెడ్డి కోరారు…
లింగాలగట్టు, శిఖరం పాయింట్ల వద్ద వాహన రాకపోకలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు…

ఒంటి గంట తరువాత శ్రీశైలం ఆలయానికి వచ్చే వాహనాల రాకపోకలకు

అనుమతిస్తామన్నారు…
మధ్యాహ్నం 2 గంటలకు మరోమారు వాహన రాకపోకలు నిలిపివేసి సున్నిపెంట నుంచి శిఖరం వైపు వాహనాలకు అనుమతిస్తామన్నారు…
శ్రీశైలంలో ఉన్న వసతి గృహాలు, బందోబస్తు నిమిత్తం ఏర్పాటు చేసిన భద్రతా సిబ్బందికి కేటాయించారు…
వీటిని దృష్టిలో పెట్టుకుని భక్తులు ప్రయాణాలు నిర్ణయించుకోవాలన్నారు…