ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి!
(J. Surender Kumar)
ఇందిరాభవన్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు అడ్లురి లక్ష్మణ్ కుమార్ ల ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.
తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష కోసం ఏకం కావాలి..
తెలంగాణకు దశ దిశ సోనియా గాంధీయే. మన విద్య, ఉద్యోగాలు మనవే..
సోనియా గాంధీ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్ర భవిషత్ ఉంది.. హైదరాబాద్ లో తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు లభించడం లేదు అని జీవన్ రెడ్డి అన్నారు.

ఆత్మత్యాగాలు, బలిదానాలు ముగింపు పలుకాలని సోనియా గాంధీ రాష్ట్రం ఇచ్చారు..
రాష్ట్ర పునర్విభజన చట్టంతో ఇరు రాష్ట్రాల ప్రజల హక్కులు కాపాడేందుకు భరోసా ఇచ్చారు..
రాష్ట్ర పునర్విభజనలోని హక్కులు కల్పించకుండ ఇరు రాష్ట్రాలపై బిజెపి వివక్షా చూపుతోంది. అన్నారు
తెలంగాణ ప్రజలకు సోనియా ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రం ఏర్పాటు చేశారు..
కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగింది..
ప్రధాన మంత్రి పదవి తృణ ప్రాయంగా భావించి త్యాగం చేసిన ఘనత సోనియా గాంధీది.
తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేసిన దేవత సోనియా గాంధీ ..
నిరుపేదల ఆకలి తీర్చెందుకు ఆహార భద్రత చట్టం తెచ్చాం.
పారదర్శక పాలన కోసం సమాచార హక్కు చట్టం తెచ్చామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డీ అన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఆలోచన విధానాలకు అనుగుణంగా విద్యా హక్కు చట్టం చేశారు.

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లురి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రలో పార్టీకి నష్టం జరుగతదని తెలిసినా రాష్ట్రం ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ది.
దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి కి కాంగ్రెస్ పాలన నే కారణం.
దేశంలో బిజెపి నుండి ప్రజలను విముక్తి చేయడానికి రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారని లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు గిరి నాగభూషణం పట్టణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నందయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తమోహన్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కండ్లపల్లి దుర్గయ్య, సీనియర్ నాయకులు తాటిపర్తి, దేవేందర్ రెడ్డి, పిసిసి మైనార్టీ కార్యదర్శి మోయిజొద్దిన్, కొండా జగన్, పుప్పాల అశోక్, సీనియర్ న్యాయవాది భాస్కర్ రెడ్డి, అధ్యక్షురాలు, మాజీ కౌన్సిలర్లు గాజుల రాజేందర్ పులి రాము, సరిత, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా మధు,బీరం రాజేష్, లైసెట్టి విజయ్, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు మన్సూర్, రమేష్ రావు, చాంద్ పాషా, రజినీకాంత్, తాజోద్దిన్ పాల్గొన్నారు.
ధర్మపురి లో..

అమరవీరుల ఆకాoక్షల్ని గౌరవించి ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియాగాంధీ గారి 76 వ జన్మదిన వేడుకలు ఈ రోజు ధర్మపురి నియోజ కవర్గ కేంద్రంలోని నంది చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనముగా నిర్వహించడం జరిగింది సోనియాగాంధీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడంతో పాటు టపాసులు కాల్చీ కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంఘనబట్ల దినేష్, వేముల రాజేష్, యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు సింహారాజు ప్రసాద్, చిలుముల లక్ష్మణ్, రాందేని మొగిలి, కస్తూరి శ్రీనివాస్, సీపతి సత్యనారాయణ, కట్ట బువనేశ్వర్ , సుముఖ్, అప్పం తిరుపతి, స్థంభం కాడి గణేష్, షబ్బీర్, ఆసెట్టి శ్రీనివాస్ ,రమేష్ , పోచయ్య రాజయ్య తదితరులు పాల్గొన్నారు