ఉచిత హెవీ మోటార్  డ్రైవర్ శిక్షణ కు

దరఖాస్తులు ఆహ్వానం  ITDR ప్రిన్సిపల్ నుజుమ్

(J.SURENDER KUMAR)

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని తెలంగాణలో నే మొట్టమొదటి ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్, రీసర్చ్ సెంటర్ లో
ఉచిత హెవీ మోటార్ వెహికల్ డ్రైవర్ శిక్షణ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ITDR ప్రిన్సిపల్ నుజుమ్ తెలిపారు.
ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.


లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్ 1 సం. పూర్తి అయి ఉన్న అభ్యర్థులకు హెవి మోటార్ వెహికిల్ (HMV) శిక్షణ కు అర్హులని ప్రిన్సిపల్ చెప్పారు.
అభ్యర్థులు కనీసం 10 వ తరగతి పాసై 160 సెంటి మీటర్ల పైగా ఎత్తు ఉండి , 22 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలని పేర్కొన్నారు. ఆధార్ లో చిరునామా తెలంగాణ కు చెంది ఉండాలన్నారు.
అభ్యర్థులకు 30 రోజుల పాటు మండేపల్లి
ఇనిస్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్, రీసర్చ్ సెంటర్ ( ITDR) లో నిపుణులైన డ్రైవర్ ల చే అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన శిక్షణ అందిస్తారని చెప్పారు.
శిక్షణ లో ప్రవేశం పొందగోరు వారు అడ్మిషన్ కోసం HMV LLR బుక్ చేసుకొని తీసుకురావాలన్నారు.
వీటితో పాటు 10 వ తరగతి సర్టిఫికెట్, ఆధార్, రేషన్ కార్డు, 4 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తమ వెంట తెచ్చుకోవాలని ప్రిన్సిపాల్ సూచించారు.
అభ్యర్థులకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మొబైల్ నెంబర్ 8985431720 లో సంప్రదించాలని చెప్పారు.
పూర్తి వివరాలకు వెబ్సైట్ www.tidessircilla.com ను కూడ సంప్రదించ వచ్చునని తెలిపారు.
ITDR లో శిక్షణ పొందితే విదేశాల్లో కూడా మంచి వేతనంతో కూడిన పారితోషికం ఉంటుందన్నారు.
తెలంగాణలోని ఔత్సాహిక లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్ లో ఈ అవకాశం ను సద్వినియోగం చేసుకోవాలనీ ప్రిన్సిపల్ కోరారు.