ఉపాధ్యాయుడిని కర్రలతో.చితకబాదిన విద్యార్థినిలు!

పోలీసుల అదుపులో నిందితుడు!

(.J. Surender Kumar)

కర్ణాటక రాష్ట్రం మండ్యలోని ఓ గ్రామంలో మైనర్ విద్యార్థినులను పట్లఅసభ్యంగా ప్రవర్తించి,.లైంగికంగా వేధించాడనే ఆరోపణలతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కొందరు బాలికలు కర్రలతో చితకా బాదరు, ఉపాధ్యాయుడు చిన్మయానంద,  ఇతను శ్రీరంగపట్నంలోని కట్టేరి గ్రామంలోని బాలికల హాస్టల్‌కు ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు.

మాండ్య తాలూకా. బాలిక విద్యార్థుల కథనం ప్రకారం, వారి హాస్టల్ తోటి విద్యార్థి ని  నిందితుడు లైంగికంగా వేధించడం, తదితరతన బాధాకరమైన అనుభవాన్ని తోటి విద్యార్థులకు చెప్పి ఆ బాలిక విలపించింది.   దీంతో కోపోద్రిక్తులైన హాస్టల్‌లోని విద్యార్థినీలు కర్రలు తీసుకుని ప్రిన్సిపాల్‌ గదిలోకి చొరబడి కొట్టారు. 

రెండు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన వివరాలు, ఘటనకు సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వార్డెన్ సహాయంతో  విద్యార్థినులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.  హాస్టల్ కు చేరుకున్న పోలీసులు ఉపాధ్యాయుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో.

చిన్మయానంద మరో టీచర్‌ను ప్రలోభపెట్టి ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని అతను విద్యార్థులకు చూపించే అభ్యంతరకర వీడియోలను కూడా ఆమెతో రికార్డ్ చేశాడని వారు తెలిపారు. వార్డెన్ ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు శ్రీరంగపట్నం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పునీత్  వార్తా సంస్థ వివరించారు